Thursday, December 27, 2012

అల్లరినరేష్ సినిమా చూస్తూ ప్రసవించిన మహిళ....

ఈ న్యూస్ నేను అల్లరి నరేష్ ట్విట్టర్ అకౌంట్లో  చూసాను. ఇటివల విడుదలై విజయం సాధించిన సుడిగాడు సినిమా చూస్తున్న మహిళ సినిమా హాల్లోనే బిడ్డకు జన్మని ఇచ్చింది. పూర్తి వివరాలు క్రింద వున్నాయి. 

Wednesday, December 26, 2012

కాకులకేందుకు అన్నం పెడతారు ?

మనకి దగ్గరగా వుండే పక్షి కాకి.కాకికి గతగతాలు తెలుసునని  శాస్రాలు  చెబుతున్నాయి .పోయిన జీవుడు కాకి రూపంలో అయిన  వాళ్ళ చుట్టూనే తిరుగుతాడని ,అన్నాన్ని పెట్టినపుడు అన్నాన్ని ముట్టుకుంటే వాని కోరికలు తిరినట్టు , ముట్టుకోకపోతే వారి కోరికలు తీరనట్టు శాస్రం చెబుతోంది.అలాగే కాకులరిస్తే చుట్టాలు వస్తారు అనే వారు, నిజంగానే వచ్చెవారు కుడా.

ఆహారం తీసుకొనెటప్పుదు తీసుకోవలిసిన జాగ్రత్తలు ....

భోజనానికి ముందు ఆమ్లగుణం గల దానిమ్మ తింటే అజీర్ణం భాద వుండదు.పుల్లని పెరుగు అస్సలు తినకూడదు .మినుమలతో చేసిన పదార్దాలు తిన్న తర్వాత పాలు త్రాగాకూడదు.తినే పదార్దాలను ఎక్కువ సార్లు వేడి చేసి తినడం అస్సలు మంచిది కాదు.ఇలా తినడం వల్ల గ్యాస్ పెరిగి అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి.తినే ఆహారాన్ని నిలబడి, కాళ్లుచాపి , నడుస్తూ, మాట్లాడుతూ అస్సలు తినకూడదు.

Monday, December 24, 2012

గంగాజలములో అంతటి శక్తి ఉండటానికి కారణమేమిటి ?

హిమాలయ్యాలో పుట్టిన జలం గంగ .గంగ  ప్రవహించె చాలా ప్రాంతం భూభాగంలో రేడియం వుండటం వల్ల ఆ నీటిలో   చైతన్య శక్తి ఇచ్చె శక్తి దాగి వుంటుంది.కలరా , అంటువ్యాధులు వంటి క్రిములు గంగాజలములో బతకలేవు.అందువలనే గంగాజలం సమస్త వ్యాధులును పోగొట్టే అమృత ప్రవాహమని అంటారు.

Sunday, December 23, 2012

గంపలో పెళ్లికుతురిని వుంచి తెచ్చెదెందుకు?

అందరు కాకపోయినా కొంతమంది పెళ్ళిలో పెళ్లికుతురిని గంపలో తీసుకొరావడం అనే పద్దతి పాటిస్తుంటారు .శ్రీమహాలక్ష్మి తామరపువ్వులో వుంటుంది.అందుకే మా ఇంటి మహాలక్ష్మిని గంప అనే తామరపువ్వులో తెచ్చి నీ కిస్తున్నాము అని బావం.

Saturday, December 22, 2012

చీమ గురించి తెలుసుకుందామా .....


చీమ గురించి తెలుసుకోవడానికి ఏముంది అనుకుంటున్నారా . అలా  అయెతే ఒకసారి ఈ క్రింది అర్టికల్ చదవండి. 

చీమ ఒక చిన్న కీటకము. ఇది తనకంటే రెట్టింపు బరువును మోయగలుగుతుంది. ఇవి భూమిని గుల్లగా చేస్తూ పుట్టలను కడుతుంటాయి.ఐకమత్యం అనగానే ముందు చీమలే గుర్తుకొస్తాయి. ఒకే పుట్టలో కలిసి ఉండడమే కాదు, వాటి పని అవి సక్రమంగా చేసుకోవడంలో ఎంతో క్రమశిక్షణ పాటిస్తాయి కూడా. చీమలు పుట్టుకొచ్చింది కందిరీగల నుంచే. ఇవి సుమారు 10 కోట్ల ఏళ్ళ కిందట కందిరీగలతో విడిపోయి, ప్రత్యేక జీవులుగా రూపొందాయి. సుమారు 11,880 జాతులుగా ఉన్న వీటిల్లో ఇటీవల కొత్తరకం చీమను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ప్రపంచంలో మొత్తం చీమలను కలిపితే వాటి బరువు, మనుషుల బరువు కన్నా ఎక్కువ ఉంటుంది.

మానవులకు మల్లే చీమలకు ఊపిరితిత్తులు, గుండె ఉండవు. రక్తానికి రంగు కుడా ఉండదు. అయినా, తమ కన్నా 20 రెట్ల బరువునైనా ఇట్టే మోస్తాయి. ఇది ఒక సాధారణ మానవుడు 1000 కిలోల బరువు మోయడంతో సమానం మరి. శరీరం పై కవచానికి ఉండే సన్నని రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటాయి. బయటకు కనబడేవి రెండు కళ్ళే అయినా, వాటిల్లోనే చిన్నచిన్న కళ్ళు బోలెడన్ని కలిసి ఉంటాయి. ఈగలకు ఉన్నట్టుగా అన్నమాట. తల మీద అటూ ఇటూ కదిలే కొమ్ముల్లాంటి అంటెన్నాలతో, తాము విడుదల చేసే రసాయనాల వాసనను పసిగట్టి మాట్లాడేసుకుంటాయి. ఇక చీమల కోరలు బలం అంతా ఇంతా కాదు.

పుట్టలను కట్టుకోవడంలో చీమల తెలివి అంతా ఇంతా కాదు. వాసలు కురిసినా పడిపోకుండాఆ గోడలు బలంగా ఉండేందుకు మట్టి, ఇసుకల్లో పుల్లలను కలిపేస్తాయి. లోపల చాలా అరలు ఉంటాయి. ఒక్కో అవసరానికి ఒక్కో అర. కొన్నింటిలో ఆహారం దాచుకుంటే.. మరికొన్నింటిలో పిల్లల పెంపకం. ఇంకొన్ని గదుల విశ్రాంతి కోసం. అయితే, అన్ని గదులను కలిపేలా దారులు ఏర్పాటు చేసుకోవడం మాత్రం మరచిపోవు. కొన్నిరకాల చీమలు చెట్ల కాండంలో ఇళ్ళను ఏర్పాటుచేసుకుంటాయి కూడా.

కలిసికట్టుగా జీవించడంలో, పనులను విభజించుకోవడంలో చీమలను మించినవి లేవు. ఒకో పుట్టలో 80 లక్షల దాకా నివసిస్తాయి. రాణి చీమలు, శ్రామిక చీమలు, సైనిక చీమలు, కాపలా చీమలు. ఇలా వేటి పని వాటిదే. రెక్కలు ఉండే రాణి చీమ గుడ్లు పెట్టడంతప్ప మరేపని చేయదు. మగ చీమలు రాణి చీమలతో జత కలిశాక వెంటనే చనిపోతాయి. ఇక రాణి కి సేవలు చేసేవేమో శ్రామిక చీమలు. ఇవి రాణి చీమ శరీరం నుంచి వచ్చే రసాయనాన్ని రుచి చూసి, దాని ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుంటాయి. గుడ్లను కాపాడడం, అవి లార్వా దశ నుంచి పిల్లలుగా మారి పెద్దయ్యే వరకు కనిపెట్టుకొని ఉంటాయి. పుట్టను కాపాడే పని సైనిక చీమలది. శత్రువులు దాడి చేశారని తెలియగానే కాపలా చీమలు ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తాయి. వాటిని పసిగట్టగానే సైనిక చీమలు ఒక్క పెట్టున దాడికి దిగుతాయి.

చీమల మాటలను ఒక రకంగా రసాయనిక భాష అనుకోవచ్చు. ఎందుకంటే.. ఏ విషయాన్ని అయినా తమలోంచి వచ్చే ' పెరోమోన్స్ ' ద్వారా తెలియజేస్తాయి. ఉదాహరణకు ఏ చీమకైనా ఆహారం కనబడిందనుకోండి. వెంటనే అది ' ఫెరోమోన్ 'ను దారి అంతటా విడుదల చేసుకుంటూ తమ ఇంటికి వస్తుంది. తిరిగి తన వారిని వెంటేసుకొని ఆ వాసనను బట్టి అక్కడికి చేరుకుంటుంది. ఇక చీమలు తమ స్థావరాన్ని ఎలా కనుక్కుంటాయంటే ... దారిలో ఉన్న కొండ గుర్తులతో పాటు సూర్యుడి దిశను గుర్తుపెట్టుకొని.

ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చీమలకు రెండు పొట్టలు వుంటాయంట . ఒక పొట్టలో తనకి కావలసిన ఆహారాన్ని, మరొక పొట్టలో మిగతా  చీమల కోసం ఆహారాన్ని తీసుకుపొతాయంట . ఇది చాలా గొప్ప విషయం కదండి. 


పెళ్ళిలో ఎవరు ముందు జీలకర్ర పెడతారో వారి మాటే చెల్లుతుందా?

మనుషుల  శరీరంలో విధ్యుత్ దాగి వుంటుంది. అదే జీవశక్తి .వివాహ సమయంలో ఎవరు ముందుగా జీలకర్ర, బెల్లం  తలపై పెడతారో వారిశక్తి అవతల శక్తిపై పడుతుంది. ఆ ప్రవాహశక్తి జీవితాంతము పని చేస్తుంటుంది.అందుకే కొంతమంది ఇంట ముందుగా జీలకర్ర, బెల్లం  పెట్టిన వారిమాటే చెల్లుబాటు అవుతుంది.సంప్రదాయంగా అయితే పెళ్లి కూతురితో ముందు పెట్టిస్తారు.

Thursday, December 20, 2012

భోజనాన్ని ఎలా తినాలి ?

 ఎత్తయిన ప్రదేశంలో నోటికి దగ్గరగా కుర్చొని తినటం ద్వారా విపరీతమైన పొట్ట వచ్చి అందం పోతుంది. క్రొవ్వు పెరిగి ఆరోగ్యం పోతుంది.భారతీయ ఋషి సంప్రదాయం ప్రకారం కటిక నేలమీద కుర్చొకుండా చాప, పట్ట వంటింది వేసుకొని , ఇంటిల్లపాది గుండ్రగా కుర్చొని మధ్యలో ఆహార పదార్దాలు పెట్టుకొని భోజనం చేస్తె కనీసం యాబై శాతం వ్యాధులను 
అరికట్టవచ్చు .

ప్రొద్దున లేవగానే ఎవరి మోహం చూసావంటె...?

మనిషి శరీరం ఓ విధ్యుత్ కేంద్రం .రాత్రంతా నిద్రపోయి మెలకువ రాగానే కనులు  తెరిచినప్పుడు దేహంలోని  విధ్యుత్ శక్తి కనుల ద్వారా బయటికి వస్తుంది.మనకిఎదురయన మనిషిలో దేహ శక్తి ఎక్కువైతే ఆ ప్రభావం మన మీద పడుతుంది.అదే వారి దేహ శక్తి తక్కువైతే మన ప్రభావం వారి మీద పడుతుంది.ఈ ప్రభావం వల్ల శరీరము ,మనస్సు అదుపు తప్పి చెయకూడని కార్యాలు చేసి ఉహించని సమస్యను తెచ్చుకుంటారు .అలా కాకుడదనే లేవగానే అరచేతులు రుద్దుకొని కళ్ళకద్దుకుని ఆపై  లేచి భగవంతుని పటాన్ని చూడమంటారు.

Thursday, December 13, 2012

జగదీశ్ చంద్ర బోస్























జగదీశ్ చంద్ర బోస్ :
జననం  -   నవంబర్ 30 1858(1858-11-30) మైమెన్‌సింగ్, తూర్పు బెంగాల్ (ప్రస్తుతము బంగ్లాదేశ్), బ్రిటీష్ ఇండియా.
మరణం  -   నవంబర్ 23 1937 (వయసు: 78) గిరిడీ, బెంగాల్ ప్రావిన్స్, అవిభాజ్య భారతదేశం
నివాసం  -   అవిభాజ్య భారతదేశం
జాతీయత   -  భారతీయుడు
రంగము -    భౌతిక శాస్త్రము, జీవ భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం, వృక్ష శాస్త్రం, పురాతత్వ శాస్త్రం, బెంగాలీ సాహిత్యం, బంగ్లా సైన్సు ఫిక్షన్
సంస్థ  -   ప్రెసిడెన్సీ కళాశాల
మాతృ సంస్థ -    కలకత్తా విశ్వవిద్యాలయం.కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం,లండన్ విశ్వవిద్యాలయం
ప్రాముఖ్యత   -  మిల్లీమీటర్ తరంగాలు, రేడియో, క్రెస్కోగ్రాఫ్
మతం   -  హిందూ

సర్ జగదీష్ చంద్ర బోస్, (నవంబర్ 30, 1858 – నవంబర్ 23, 1937) బెంగాల్ కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త. ఇతడు రేడియో మరియు మైక్రోవేవ్ ఆప్టిక్స్ తో వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాల్ని సాధించారు. ఇతన్ని రేడియో విజ్ఞానంలో పితామహునిగా పేర్కొంటారు. ఇతడు భారతదేశం నుండి 1904 సంవత్సరంలో అమెరికా దేశపు పేటెంట్ హక్కులు పొందిన మొట్టమొదటి వ్యక్తి.

 జీవితం
ఆంగ్లేయుల సామ్రాజ్యంలోని బెంగాల్ ప్రావిన్సు లో జన్మించిన బోసు కలకత్తా లోని సెయింట్ జేవియర్ కళాశాల నుంచి డిగ్రీ పుచ్చుకున్నాడు. తరువాత ఆయన వైద్య విద్య కోసం లండన్ వెళ్ళాడు. కానీ ఆరోగ్య సమస్యల వలన చదువును కొనసాగించలేకపోయాడు. తిరిగి భారతదేశానికి వచ్చి కోల్‌కత లోని ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతిక శాస్త్ర ఆచార్యుడిగా చేరాడు. అక్కడ జాతి వివక్ష రాజ్యమేలుతున్నా, చాలినన్ని నిధులు, సరైన సౌకర్యాలు లేకపోయినా
 తన పరిశోధనను కొనసాగించాడు.

 పరిశోధనలు
ఈయన వైర్‌లెస్ సిగ్నలింగ్ పరిశోధనలో అద్భుతమైన ప్రగతిని సాధించాడు. రేడియో సిగ్నల్స్ ను గుర్తించడానికి అర్థవాహక జంక్షన్ లను మొట్టమొదటి సారిగా వాడింది జగదీశ్ చంద్రబోసే. కానీ తన పరిశోధనలను వ్యాపారాత్మక ప్రయోజనాలకు వాడుకోకుండా తన పరిశోధనల ఆధారంగా ఇతర శాస్త్రవేత్తల మరిన్ని ఆవిష్కరణలకు దారి తీయాలనే ఉద్దేశ్యంతో బహిర్గతం చేశాడు.

 ఆవిష్కరణలు
తరువాత వృక్ష భౌతిక శాస్త్రంలో కొన్ని అద్భుతమైన ఆవిష్కరణలు చేశాడు. తాను రూపొందించిన పరికరం క్రెస్కోగ్రాఫ్ ను ఉపయోగించి వివిధరకాలైన పరిస్థితుల్లో మొక్కలు ఎలా స్పందిస్తాయో పరిశోధనాత్మకంగా నిరూపించాడు. తద్వారా జంతువుల మరియు వృక్ష కణజాలాలో సమాంతర ఆవిష్కరణలు చేశాడు. అప్పట్లో తాను కనిపెట్టిన ఆవిష్కరణకు సన్నిహితుల ప్రోధ్బలంతో ఒక దానికి పేటెంట్ కోసం ఫైల్ చేసినా ఆయనకు పేటెంట్లంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు.ఆయన చనిపోయిన 70 సంవత్సరాల తరువాత కడా విజ్ఞాన శాస్త్రానికి ఆయన చేసిన సేవలను ఇప్పటికీ కొనియాడుతూనే ఉన్నాం.


Tuesday, December 11, 2012

థామస్‌ ఆల్వా ఎడిసన్


Thomas Alva Edison,థామస్‌ ఆల్వా ఎడిసన్




థామస్‌ ఆల్వా ఎడిసన్‌- (ఫిబ్రవరి 11, 1847 – అక్టోబర్ 18, 1931) ఫిబ్రవరి 11, 1847న అమెరికాలో జన్మించిన
 థామస్‌ ఆల్వా ఎడిసన్‌ తల్లిదండ్రులు డచ్‌, స్కాట్లాండ్‌ కు చెందినవారు. 16 ఏళ్ళకే టెలిగ్రాఫ్‌ ఆపరే టర్‌
 అయ్యాడు. ఆటోమేటిక్‌ టెలిగ్రాఫ్‌ కోసం ట్రాన్స్‌మీటర్‌, రిసీవర్లను కనిపెట్టడం ఆయన మొదటి ఆవిష్కరణ.
 1877లో ఫోనోగ్రాఫ్‌ను కనుగొన్నాడు. 40 గంటలపాటు పనిచేసే కా ర్బనైజ్‌డ్‌ కార్బన్‌ త్రెడ్‌ ఫిలమెంట్‌ను తయారు
 చేసి 1879 అక్టోబర్‌ 21న ప్రయోగాత్మకంగా ప్రదర్శించాడు.థామస్ అల్వా ఎడిసన్  మానవ జాతిని ప్రభావితం
 చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త 
 మరియు వ్యాపారవేత్త.

1882లో న్యూయార్క్‌లో విద్యుత్‌ స్టేషన్‌ను స్థాపించాడు. కైనెటోస్కోప్‌ ప్రాసెస్‌ ద్వారా 1890లో మోషన్‌ పిక్చర్స్‌ను
 తీయడం మొదలుపెట్టాడు. మైనింగ్‌, బ్యాటరీ, రబ్బర్‌, సిమెంట్‌ రక్షణోత్పత్తులు-మన జీవి తంలో
 భాగమైపోయిన ఎన్నింటికో ఎడిసన్‌ ఆద్యుడు. ఆయన ఆవిష్కరణలు సమాజం రూపురేఖలనే మార్చివేశాయి. 
ఆవిరి యంత్ర దశ నుండి విద్యుత్‌కాంతుల్లోకి నాగరికత ప యనించడానికి ఆయన పరిశోధనలే కారణం. 
1300 ఆవిష్కరణలపై పేటెంట్‌ హక్కులు పొందాడు. ఆయన అంత్యక్రియల రోజు ఆయన గౌరవార్ధం అమెరికా 
ప్రజలు తమ గృహాల్లో లైట్లను ఆర్పివేసి నివాళి అర్పించారు.

బాల్యము

ఎడిసన్ అమెరికా లోని ఓహియో రాష్ట్రానికి చెందిన మిలన్ అనే ప్రాంతంలో జన్మించి మిషిగాన్ రాష్ట్రంలోని 
పోర్టుహ్యురాన్ అనే ప్రదేశంలో పెరిగాడు. తండ్రి శామ్యూల్ ఆగ్డెన్ ఎడిసన్ జూనియర్ (1804-1896) మరియు
 తల్లి నాన్సీ మాథ్యూస్ ఎడిసన్ (1810-1871) లకు ఏడవ మరియు చివరి సంతానం.ఇతని కుటుంబం డచ్ 
మూలాలు కలిగినది.

 వివాహం

డిసెంబర్ 25, 1871న 24 సంవత్సరాల వయసులో ఎడిసన్ రెండు నెలలు ముందుగా కలుసుకున్న 16 యేళ్ళ
 మారీ స్టిల్ వెల్ ను వివాహమాడాడు. వీరికి ముగ్గురు సంతానం.

    * మరియన్ ఎడిస (1873–1965), ముద్దు పేరు డాట్
    * థామస్ అల్వా ఎడిసన్ జూనియర్ (1876–1935), ముద్దు పేరు డాష్
    * విలియం లెస్ల్య ఎడిసన్ (1878–1937)

 కెరీర్ ప్రారంభం

ఎడిసన్ మొదటగా న్యూజెర్సీ లోని నెవార్క్ లో పరిశోధకుడిగా తన ప్రస్థానాన్ని ఆరంభించాడు.ఆయన మొదట 
పని చేసినవి ఆటోమాటిక్ రిపీటర్ మరియు టెలిగ్రాఫిక్ పరికరాలు కానీ అతనికి పేరు తెచ్చి పెట్టినది మాత్రం
1877 లో కనిపెట్టబడిన ఫోనోగ్రాఫ్. ఈ పరికరాన్ని కనిపెట్టినపుడు ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. 
ఆయనకు మెన్లో పార్క్ మాంత్రికుడు అనే పేరు పెట్టారు.

Thursday, December 6, 2012

సరదాగా

నేను కాలెజ్ డేస్ లో వున్నపుడు ఫ్రెండ్స్ తో కలసి హాస్టల్ లో ఉండేవాడిని. రాత్రి డిన్నర్ అయ్యిన తరువాత ఫ్రెండ్స్ అంతా కలిసి కమ్యునికెషన్ స్కిల్స్ పెంచుకొవడానికి ఇంగ్లీష్ పాటల్ని తెలుగు లోకి వున్నది వున్నట్టుగా మార్చి పాడుకునె  వాళ్ళం . ఎక్కువగా టైటానిక్ సినిమా లో పాటని పాడేవాళ్ళం . ఈ పాట తెలుగులో పాడుతున్నపుడు నవ్వలేక పోయేవాళ్ళం . చాలా రొజుల తర్వత ఈ సంగటన జ్ఞాపకం వచ్చింది. ఇది మే అందరితో పంచుకొవాలి అని ఇలా పోస్ట్ చెస్తున్నాను. 

ముందుగా ఈ పాటను ఇంగ్లీష్ లో రాయడం జరిగింది.

Every night in my dreams
I see you, I feel you
That is how I know you 
go on
Far across the distance
And spaces Between us
You have come to show you 
go on

Near, far, wherever you are
I believe that the heart does go on
Once more you open the door
And you're here in my heart and
My heart will go on and on
Love can touch us one time

And last for a lifetime
And never let go 'til 
we're gone

Love was when I loved you
One true time I hold to
In my life we'll always 
go on

Near, far, wherever you are
I believe that the heart does go on
Once more you open the door
And you're here in my heart and
My heart will go on and on

You're here, there's nothing I fear
And I know that my heart will go on
We'll stay forever this way
You are safe in my heart and
My heart will go on and on 

ఇప్పుడు తెలుగు లో ట్రాన్స్ లేట్ చేస్తె  ఈ పాట ఎలా వుంటుందో  చుద్దామా  !


 ప్రతి రాత్రి నా కలలో 
 నేను చుసాను నిన్ను, నేను అనుభూతి నిన్ను 
 అది ఉంది ఎలాగో నేను తెలుసు నువ్వు 
 పయనించె
దూరంగా అడ్డంగా అ దూరం 

మాకు మధ్య ఖాళీలు
మీరు చూపించడానికి వచ్చిన
పయనించే


దగ్గర, చాలా, మీరు ఎక్కడ ఉన్నారు
నేను గుండె మీద వెళ్ళి అని నమ్ముతారు
ఒకసారి మరింత మీరు తలుపు
మరియు మీరు నా గుండె లో ఇక్కడ ఉన్నాము మరియు
నా గుండె మీద మరియు వెళ్తుంది


లవ్ మాకు ఒక సమయంలో ప్రభావితం చేయవచ్చని
మరియు ఒక జీవితకాలం కోసం గత
మరియు వీడలేదు ఎప్పుడూ వరకు
మేము పోయింది ఉన్నాము
నేను మీరు ప్రేమించే సమయంలో ప్రేమ
నేను కలిగి నిజమైన సమయం
నా జీవితంలో మేము ఎల్లప్పుడూ చేస్తాము
పయనించే


దగ్గర, చాలా, మీరు ఎక్కడ ఉన్నారు
నేను గుండె మీద వెళ్ళి అని నమ్ముతారు
ఒకసారి మరింత మీరు తలుపు
మరియు మీరు నా గుండె లో ఇక్కడ ఉన్నాము మరియు
నా గుండె మీద మరియు వెళ్తుంది

మీరు ఇక్కడ ఉన్నారు, నేను ఆ భయం ఏమీ లేదు
మరియు నేను నా గుండె మీద వెళ్ళి తెలుసు
మేము ఎప్పటికీ ఈ విధంగా ఉండాలని చేస్తాము
మీరు నా గుండె లో సురక్షిత మరియు
నా గుండె మీద మరియు వెళ్తుంది




పొడుపుకధ విప్పండి

ఎగిరిన ఎగురును , పోయిన పోవును

నడచిన  నడుచును, నోట మాట లేదు

ఏమిటో చెప్పండి చూద్దం  !





 ,

Wednesday, December 5, 2012

పొడుపుకధ విప్పండి


అరచేయంత మడుగు, దాని నిండా నీరు
నీటిలొ కాడ ,కాడ చివర పువ్వు

 ఎమిటో చెప్పండి


అందమైన ప్రేమకధ




ఒక చిన్న అబ్బాయికి....
చిన్న అమ్మాయి ఫొటో దొరికింది.
‘ఎంత ముద్దొస్తుందో’ అనుకున్నాడు.
ఫొటోను భద్రంగా దాచుకున్నాడు.
కాలం ముందుకు వెళ్లిపోయింది.
ఆ అబ్బాయికి పెళ్లయిపోయింది.
భర్త చేతిలోని చిన్న అమ్మాయి ఫొటో చూసి, ఆశ్చర్యపడి-
‘‘ఈ ఫొటో మీ దగ్గరకు ఎలా వచ్చింది?’’ అని అడిగింది.
‘‘నాకు పదేళ్లు ఉన్నప్పుడు... ఈ ఫొటో దొరికింది. అప్పటి నుంచి నా దగ్గరే ఉంది’’ చెప్పాడు అబ్బాయి.
‘‘నీకో విషయం తెలుసా? ఫొటోలో ఉన్నది నేనే. ఏడు సంవత్సరాల వయసులో ఆ ఫొటో పోగొట్టుకున్నాను’’... అసలు విషయం చెప్పింది భార్య!



‘‘ఆమెను ఎప్పటి వరకు ప్రేమిస్తావు?’’ అని అడిగాడు ఒకడు.
నేను అన్నాను:
‘‘సముద్రంలో గుండుసూది వేసాను. దాని కోసం వెతుకుతున్నాను. అది దొరికే వరకు ప్రేమిస్తూనే ఉంటాను

నాని కొత్త సినిమా విశేషాలు


Directed bySamuthirakani
Produced byK. S. Sreenivasan
Starring
Music byG. V. Prakash Kumar
CinematographyM.Sukumar
Editing byA.L.Ramesh
StudioVasan Visual Ventures
Release date(s)
  • March 14, 2013[1]
CountryIndia
LanguageTelugu



నాని  కొత్త సినిమా పేరు జెండా ఫై కపిరాజు.ఈ సినిమా లో నాని సరసన అమలపాల్ హీరోయిన్ గా నటిస్తోంది.తొలిసారిగా నాని అమలపాల్ లు ఈ సినిమా కోసం జతకట్టనున్నారు . ఈ సినిమా లో నని మొదటిసారిగా డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ మరియు థ్రిల్లర్ ముఖ్య కదానంసాలుగా రూపుదిద్దు కుంటోంది.ఈ సినిమా లో నానిలోని మరో కొత్త కోణాన్ని మనం తెర మీద చూడవచ్చు.

Tuesday, December 4, 2012

మరో భూమి కోసం మానవ అన్వేషణ



ఆ మధ్య 'అవతార్‌' అని ఒక సినిమా వచ్చింది. అందులో ఆకట్టుకునే అంశం ఒకటుంది. అదేమంటే 'పండోరా' అనే గ్రహం మీద కూడా (భూమి కాకుండా) మన వంటి జీవజాలం వుండడం. సినిమా కల్పనే కావచ్చు. జీవాలు ఉన్న గ్రహం అనేది ఊహ నుండి పుట్టిన సృజనే కావచ్చు. కానీ ఆధారం లేకుండా అటువంటి ఆలోచనలు ఆవిర్భవించవు కాబోలు. మనలో అంతర్గతంగా పాతుకుపోయిన 'గ్రహాంతర జీవం' అనే అంశం అభివృద్ధి చెంది ఆ విధంగా రచనల్లో, సినిమాల్లో బయటికి వస్తోంది కాబోలు. కానీ ఇకపై ఈ 'కాబోలు' కబుర్లు కట్టిపెట్టవచ్చు. భూమి వంటి గ్రహాలు ఇంకా అంతరిక్షంలో వున్నాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఇహనో.. ఇప్పుడో... వాటిపై జీవం ఉందో లేదో కూడా తెలిసిపోతుంది.
ఎందుకో తెలియదు కానీ మనిషికి మొదటినుండి అంతరిక్షంపై అవ్యాజమైన ప్రేమ. అంతరిక్షంలో తిరిగే గ్రహాలను తన జీవిత గమనానికి ముడిపెట్టుకున్నాడు. కొన్ని గ్రహాలను దేవుళ్లుగా, దేవతలుగా చేసుకున్నాడు. సూర్యుణ్ణి భగవానుడు అన్నాడు. మరణించిన కొందరు మానవులను నక్షత్రాలుగా చేసేశాడు. శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత గ్రహాలూ మామూలు భౌతిక పదార్థాలే అని తెలిసింది. చంద్రునిపై కాలు పెట్టి అక్కడి మన్నూ, రాళ్లూ తెచ్చి చంద్రుడు 'మామ' కాడు, పిలిస్తే రాడు అని తేల్చి పారేసింది. రోవర్ల సాయంతో అంగారకుని ఉపరితలాన్ని భూమి మీద నుండే అధ్యయనం చేసింది. సౌరకుటుంబంలోని గ్రహాల విశేషాలను, వివరాలను దాదాపు తెలుసుకుంది. అయితే ఇదంతా మన సౌరకుటుంబం పరిధికే పరిమితమైంది. ఈ విశ్వంలో మనం కాక మరొక జీవ ప్రపంచం ఉందేమో అన్న అనుమానం మనిషిని వదలలేదు. అందుకు తగ్గట్టు గ్రహాంతర వాసుల కోసం అన్వేషణ ఆరంభమైంది. ఈ క్రమంలో 'అదిగో పులి అంటే ఇదిగో తోక' అన్నట్టు ఎన్నో పుకార్లు. ఒకవేళ గ్రహాంతర వాసులు వుంటే గింటే ఎలా ఉంటారో అని సృజనాత్మకత చూపిన వారు కొందరైతే, అచ్చంగా అటువంటి వారినే చూశామని చెప్పిన వారు కొందరు. ఒక పక్క అటువంటి 'గ్రహాంతర జీవాన్వేషకులు' తమ విధిలో నిమగమై ఉంటే, అసలు విశ్వంలో ఇతర సౌర కుటుంబాలు ఎన్ని వున్నాయి? వాటిలో జీవానుకూలమైన గ్రహాలూ ఏమైనా ఉన్నాయా? అన్న వెదుకులాటలో కొందరున్నారు. ఈ అన్వేషణలో వెలికి వచ్చే ఫలితాలు మనకి (మనిషికి) మేలు చేస్తాయో లేదో తెలీదు కానీ, ఏదో కొత్త విషయం మాత్రం తెలియొచ్చు. అంతరిక్షం అనంతమైందన్న అవగాహన మనకు వుంది. అటువంటి అంతరిక్షాన్ని అన్వేషించడమూ అనంతంగా సాగుతూనే వుంది. ఆ అన్వేషణ ఎందుకోసం అంటే... మన గ్రహము, సౌర కుటుంబము, అసలు విశ్వపు తాలూకు పూర్వాపరాలను తెలుసుకోవడం కోసం అనే చెప్పాలి. ఆ క్రమంలో ఎన్నో వింతలు, అద్భుతాలు, ఆశ్చర్యపరిచే విషయాలూ వెలికి వచ్చాయి. ఇంకా వస్తున్నాయి.
మనకు అతి సమీప నక్షత్రమైన సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలలాగే లక్ష లక్షల నక్షత్రాల చుట్టూ కూడా గ్రహాలు ఉండి ఉంటాయని అనుకునేవారం. కానీ 1995లో మరొక నక్షత్రం చుట్టూ పరిభ్రమించే గ్రహాన్ని తొలిసారి గుర్తించడంతో పరిస్థితి మారిపోయింది. ఇక అప్పటి నుండి సౌర కుటుంబానికావల 708 గ్రహాలను కనుగొని, వాటిని నిర్థారించి, శాస్త్రీయ పట్టిక రూపొందించడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తైతే, పని చేయడం మొదలు పెట్టిన పదహారు మాసాలకే కెప్లర్‌ టెలిస్కోప్‌ 2,326 గ్రహాల వంటి వాటిని కొనుగొంది. అయితే వాటిలో 31ని మాత్రమే నిజమైన గ్రహాలుగా పరిగణించారు.
ఇటీవల భూమి వంటి మరో గ్రహాన్ని అంతరిక్ష పరిశోధకులు గుర్తించారు. ఆ భూమి వంటి గ్రహం భూమి వంటి పరిమాణం కలిగి, ఒక సూర్యుని వంటి నక్షత్రం చుట్టూ భూమిలాంటి దూరంలోనే పరిభ్రమిస్తోంది. అంతేకాదు, దానిపై భూమి వంటి ఉష్ణ్రోగ్రతే 22 డిగ్రీల సెల్సియస్‌ ఉంది. రెండేళ్ల నుండి అంతరిక్షంలో అన్వేషణ కొనసాగిస్తున్న 'కెప్లర్‌' అనే దూరదర్శిని ఈ భూమి వంటి కొత్త గ్రహాన్ని గుర్తించింది. ఇదొక్కటే కాదు, కెప్లర్‌ ప్రతి మూడు నాలుగు నెలలకీ వందల కొద్దీ 'గ్రహాల' ఆచూకీ కనిపెడుతోంది. ఇంత భారీ స్థాయిలో గ్రహాల ఉనికి దొరుకుతుంటే గ్రహాల వేటగాళ్లలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. అతి తొందరలోనే భూమి వంటి గ్రహం కంట పడుతుందన్న నమ్మకంతో వారున్నారు. ఆ మధ్య అంగారక గ్రహంపై నీటి ఆనవాళ్లు దొరికాయనీ, మన ఉపగ్రహమైన చంద్రుడిమీద కూడా జలం వుండేదనడానికి గుర్తులూ లభించాయని సంతోషించారు. ఈ విశాల అనంత విశ్వంలో ఎక్కడో ఒక చోటైనా జీవం తాలూకు జాడలు ఉండి ఉంటాయని, ఆ మాటకొస్తే జీవులే ఉండి ఉంటాయనీ మన విశ్వాసం. ఇటీవలి కాలంలో బయల్పడుతున్న ఇతర 'ఆవాస యోగ్య గ్రహాల' ఆచూకీ మన విశ్వాసాన్ని మరింత పెంచుతోంది.
మరో భూమి!
కెప్లర్‌ టెలిస్కోప్‌ కనిపెట్టిన నూతన గ్రహం పేరు కెప్లర్‌ 22బి. ఈ గ్రహం సూర్యుని వంటి నక్షత్రం చుట్టూ తిరిగే తొలి 'ఆవాస యోగ్య' గ్రహం. అంటే మన భూమిలాగే అక్కడ కూడా ప్రాణికోటి నివసించగలదన్నమాట ఇంతకు ముందు కనిపెట్టిన గ్లీస్‌581డి, హెచ్‌డి85512బిజి గ్రహాలు కూడా ఆవాస యోగ్య పరిధి లోనే ఉన్నాయి. కానీ అవి కాస్త చిన్న, తక్కువ ఉష్ణోగ్రత గల నక్షత్రాల చుట్టూ తిరుగుతున్నాయి.
కెప్లర్‌ 22బి భూమి కంటే 2.4 రెట్లు పెద్దది, మనకు 600 కాంతి సంవత్సరాల దూరాన ఉంది. అది ఒకసారి తన సూర్యుడి(నక్షత్రం)ని చుట్టి రావడానికి 290 రోజులు తీసుకుంటుంది. అంటే అక్కడి సంవత్సరం మన సంవత్సరం కంటే చిన్నది. ఆ గ్రహ వాతావరణం వెచ్చగా, జీవాభివృద్ధికి అనుకూలంగా ఉన్నట్లు తెలిసినా, దాని ఉపరితలం ఘనరూపంలో ఉందో లేక జల, వాయు రూపంలో ఉందో తెలియదు. కానీ కొందరు మాత్రం ఈ విశ్వంలో మనం ఏకాకులం కాదంటున్నారు. అంటే భూమిలాంటి గ్రహాలు మరికొన్ని వున్నాయంటున్నారన్నమాట. ఈ కొత్త గ్రహంపై నీరు ద్రవ రూపంలో ఉండడమే కాకుండా, అది సముద్రాల రూపంలో ఉండొచ్చని అంటున్నారు. ఇంకొంతమంది ఇంకాస్త ముందుకెళ్లి అక్కడ ఆల్రెడీ ప్రాణులు ఉన్నాయంటున్నారు. అంతరిక్ష పరిశోధక సంస్థ నాసా ప్రకారం ఈ గ్రహం ప్రాణులు నివసించడానికి వీలుగా ఉంది. కానీ దీని గురించి సంపూర్ణ సమాచారం లభించడానికి దశాబ్దాలో, శతాబ్దాలో పట్టొచ్చు. మరి ఆరు వందల కాంతి సంవత్సరాలకు ఆవల ఉన్న గ్రహం గురించి తెలుసుకోవడం అంత సులభం కాదు కదా. కొన్ని వందల కిలోమీటర్ల దూరాన ఉన్న చంద్రుడి గురించి వివరాలు సేకరించడానికి, దానిపై కాలు మోపడానికే మనకు డెభ్బై ఏళ్ల సమయం పట్టింది.
మనకి ఆరువందల కాంతి సంవత్సరాల దూరమంటే ఊహించుకోవడం కష్టమే. ఒక కాంతి సంవత్సరం మన కిలోమీటర్ల లెక్కలో పది ట్రిలియన్ల కిలోమీటర్ల దూరం. ట్రిలియన్‌ అంటే 1000000000000 (ఒకటి పక్కన పన్నెండు సున్నాలు). మైళ్ల లెక్కలో అయితే 3,526,800,000,000,000 మైళ్లు. చాలా దూరమే! గంటకు 22,315 మైళ్ల వేగంతో ప్రయాణిస్తే, ఆ గ్రహాన్ని చేరడానికి సుమారు ఇరవై మిలియన్‌ సంవత్సరాల కాలం అవసరం!! అంత దూరాన జీవం ఉంటే ఏం, లేకపోతే ఏం. అయితే చాలామంది ఈ కొత్త గ్రహాన్ని కనిపెట్టడంపై ఆనందోత్సాహాలు వ్యక్తపరుస్తున్నారు. ఇంత అన్వేషణ తర్వాత ఏంటి అనేది ప్రశ్న. ఒకవేళ నివాస యోగ్యమైన గ్రహం గానీ గుర్తించబడితే మనం అక్కడికి వెళ్లి డేరా వేయొచ్చా? అనడిగితే కుదరదంటున్నారు శాస్త్రజ్ఞులు. పైగా అసలు కెప్లర్‌ 22బి పైన ఇప్పటికే జీవులు ఉండొచ్చేమో అన్న అనుమానం ఉంది. మనకు అతి దగ్గరగా ఉన్న నక్షత్రం నాలుగు కాంతి సంవత్సరాల దూరాన ఉంది. ఇప్పటికి అందుబాటులో వున్న అత్యంత వేగవంతమైన రాకెట్ల సహాయంతో దానికి చేరువగా వెళ్లడానికే కొన్ని వేల సంవత్సరాల కాలం పడుతుంది. భూమి వంటి గ్రహాన్ని గుర్తించడం ఒక దశ. ఆ గ్రహం నుండి వెలువడే కాంతిని నేరుగా విశ్లేషించడం తర్వాతి దశ. దీనిద్వారా అక్కడి వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని రాబట్టవచ్చు. అప్పటి వరకూ అసలు ఆ గ్రహంపై జీవం ఉందో లేదో తెలిసే అవకాశమే లేదు.
కెప్లర్‌ ఘనత
ఖగోళ శాస్త్రంలో గొప్ప పేరు తెచ్చుకున్న జోహాన్నెస్‌ కెప్లర్‌ డిసెంబర్‌ 27, 1571న జన్మించాడు. పాతికేళ్లకే అతను 'మిస్టీరియం కాస్మోగాఫికం' అనే గ్రంథం రచించాడు. అందులో తనను ప్రభావితం చేసిన కోపర్నికస్‌ ప్రతిపాదనలను సమర్థించాడు. పైగా ఎన్నో రంగాలలో తన మేథను చూపాడు. మరెన్నో రంగాలలో ఆద్యుడిగా నిలిచాడు. అందులో కొన్ని...
* గ్రహాల కదలికలను తొలిసారిగా కచ్చితంగా వివరించాడు. తత్ఫలితంగా కొన్ని సూత్రాలను ప్రతిపాదించాడు.
* దీర్ఘ దృష్టి, హ్రస్వ దృష్టి కొరకు కంటి అద్దాల నమూనా రూపొందించాడు.
* రెండు కళ్ల వల్ల దృష్టి ఎలా ఉంటుందనేది వివరించాడు.
* తన గ్రంథం 'డయాప్త్రిసిస్‌'లో టెలిస్కోప్‌ ఎలా పనిచేస్తుందో వివరించాడు.
* చంద్రుడి వల్ల ఆటుపోట్లు ఎలా కలుగుతాయో ముందుగా వివరించాడు. గెలీలియో దాన్నే నిరూపించాడు.
* సూర్యుడు ఒక అక్షంపై తిరుగుతాడని చెప్పాడు.
* క్రీస్తు జన్మదినం లెక్కగట్టి ప్రతిపాదించాడు. ఇప్పుడు అదే తేదీని ప్రపంచమంతా పాటిస్తోంది.

* 'శాటిలైట్‌' అనే పదాన్ని పుట్టించాడు.అనంత విశ్వంలో అన్వేషణ

గ్రహాలను ఎలా గుర్తిస్తారు?
విశ్వాంతరాళం లోని రహస్యాలను కనిపెట్టడం ఒకప్పుడు ఊహకు కూడా అందనిది. అయితే, ఈ రోజు సాంకేతిక విజ్ఞానం మనిషికి ఎంత సాయపడుతుందో ఊహకి అందడం లేదు. అత్యంత వేగంగా ప్రయాణిస్తేనే గమ్యం చేరడానికి వేల, లక్షల ఏళ్లు పట్టేంత దూరాన ఉన్న ఖగోళ పదార్థాలను గుర్తించడం అసంభవం అనుకోవడం నుండి 'ఇదిగో చూడండి, కనిపెట్టాం' అనే స్థాయికి చేరుకున్నాం. గ్రహాలు సూర్యుని వంటి నక్షత్రాల చుట్టూ పరిభ్రమిస్తాయని మనకు తెలుసు. నక్షత్రాల నుండి కాంతి వెలువడుతుందనీ తెలుసు. ఒక కాంతి జనకం ముందు ఏదైనా పదార్థం ప్రయాణించినప్పుడు ఆ కాంతిలో కాస్త మార్పు (తగ్గుదల) వస్తుందని తెలుసు. ఇదే జ్ఞానంతో ఇప్పుడు ఖగోళ మండలంలో గ్రహాలను వెతుకుతున్నారు.
కెప్లర్‌ దూరదర్శిని. కొన్నికోట్ల కిలోమీటర్ల దూరాన ఉన్న నక్షత్ర మండలాలను గుర్తించడానికి రూపొందించబడింది. కెప్లర్‌ని నాసా మార్చ్‌6, 2009న అంతరిక్షంలోకి పంపింది. మన పాలపుంతను వడగడుతూ, అందులోని కోట్లాది నక్షత్రాల చుట్టూ తిరుగుతూ, జీవులకు అనువైన గ్రహాలను కనిపెట్టడమే కెప్లర్‌ విధి. మూడున్నర సంవత్సరాల కాల పరిధిలో అది తన విధి నిర్వహించాలి. కెప్లర్‌లో గొప్ప పరికరాలు కూడా ఏమీ లేవు. కేవలం అతి సున్నితమైన ఫొటోమీటర్‌, కొన్ని సెన్సార్లు ఉంటాయి. దానికి కావలసిన శక్తిని సోలార్‌ పానెళ్ల ద్వారా సూర్యుని నుండి గ్రహిస్తుంది. తన మూడున్నర సంవత్సరాల కాలంలో కెప్లర్‌ సుమారు లక్ష నక్షత్రాల ప్రకాశ మార్పులను పసిగడుతుంది. ఒక నక్షత్రం ముందు నుండి ఒక గ్రహం ప్రయాణిస్తే, ఆ నక్షత్ర కాంతిలో కొంత మార్పు వస్తుంది. కెప్లర్‌ అటువంటి మార్పులను చక్కగా గుర్తించగలదు. ఆ మార్పు రెండు నుండి పదహారు గంటల వరకూ ఉండొచ్చు. ఒకవేళ ఆ మార్పు కచ్చితమైన కాలానుగుణంగా ఉంటే అది ఒక గ్రహం అని నిర్థారిస్తారు. పైగా అటువంటి మార్పు అదే మోతాదులో, అదే కాలానుగుణంగా పదే పదే జరిగితేనే ఆ గ్రహ ఉనికిని నిజమైనదిగా గుర్తిస్తారు. ఒకసారి గ్రహ నిర్థారణ జరిగాక, దాని పరిభ్రమణ పరిధిని లెక్కగడతారు. తన నక్షత్రం చుట్టూ ఒకసారి తిరగడానికి ఆ గ్రహం తీసుకునే సమయాన్ని ఇందుకు ఉపయోగిస్తారు. అలాగే ఆ గ్రహం దాటినప్పుడు తగ్గిన నక్షత్ర కాంతిని బట్టి ఆ గ్రహం పరిమాణాన్ని లెక్క గడతారు.
అయితే ఇదంతా చెప్పినంత సులభం కాదు. ఒక భారీ నక్షత్రం ముందు నుండి ఒక గ్రహం వెళ్లినప్పుడు ఆ నక్షత్ర కాంతిలో కలిగే మార్పు కారు హెడ్‌ లైట్ల ముందు నుండి ఒక దోమ వెళ్తే కలిగే మార్పులా ఉంటుంది. మరి అంత సూక్ష్మ మార్పుని పసిగట్టడమంటే సవాలే. ఇక భూమి వంటి గ్రహాన్ని గుర్తించడమంటే ఆ హెడ్‌ లైట్ల ముందు దోమ ఆనవాలు పట్టడమే. అటువంటి సవాలుని కెప్లర్‌ సమర్ధవంతంగా ఎదుర్కొని పని చేస్తోంది.
పేరు ఎలా పెడతారు?
కొత్తగా కనిపెట్టిన గ్రహాలకు పేర్లెలా పెడతారు? అన్న అనుమానం వస్తుంది. ఉదాహరణకు ఇటీవల కనిపెట్టిన మన భూమి వంటి గ్రహాన్ని కెప్లర్‌ 22బి అని పిలుస్తున్నారు. కాల్పనిక ప్రపంచంలో (పుస్తకాలు, సినిమాలు) అటువంటి గ్రహాలకు కాస్త అందమైన పేర్లు కూడా ఉన్నాయి. పండోరా(అవతార్‌ చిత్రంలో), ఎండోర్‌, అరకిస్‌ వంటివి. కానీ వాస్తవిక ప్రపంచంలో మనకి గ్లీస్‌ 581డి, హెచ్‌డి85512, కెప్లర్‌ 22బి వంటి పొడి పేర్లు ఉన్నాయి. నిజానికి కనిపెట్టిన ప్రతి గ్రహానికీ మంచిపేర్లు పెట్టాలని ఒక ప్రతిపాదన వచ్చింది. బహుశా ఏ గ్రీకు, రోమన్‌ పేరులో పెట్టమని వుండవచ్చు. కానీ ఆ ప్రతిపాదనను ఎవరూ అంతగా పట్టించుకోలేదు. పైగా దానివల్ల అసలు ప్రక్రియ నెమ్మదౌతుందని ఒక అనుమానం. ఎందుకంటే పేరు పెట్టడానికి ముందుగా ఒక అంతర్జాతీయ అవగాహన కావాలి. అందుకు సమయం పట్టవచ్చు. ఇక్కడ కొత్త గ్రహాలేమో దాదాపు రోజుకొకటి చొప్పున వెలికి వస్తున్నాయి! (2010లో 385 కొత్త గ్రహాలను కనిపెట్టారు). ప్రస్తుతం కొత్త గ్రహాలకు పేర్లు పెట్టే పద్ధతి సులభంగానే వుంది. ఒక గ్రహాన్ని కంటితో చూడగలుగుతున్నామంటే దానికి ఒక పేరు ఉండి తీరుతుంది. టెలిస్కోప్‌ ద్వారా కనిపెడితే దానికి ఒక ప్రత్యేక స్థాయి (స్టేటస్‌) ఇస్తారు. బహుళ నక్షత్ర వ్యవస్థలో కనిపెట్టిన ఒక్కో నక్షత్రానికి సిరియస్‌ బి, సిరియస్‌ బి అని పేర్లు పెడతారు. వాటి చుట్టూ ఉన్న గ్రహాలకు చిన్న అక్షరాలను జోడిస్తారు.
ప్రస్తుతం ఇప్పటి వరకూ తెలియని, పేరు పెట్టని గ్రహాలను అన్వేషిస్తున్నారు. 'కెప్లర్‌' అనే అంతరిక్ష టెలిస్కోప్‌ కొత్త నక్షత్ర కూటములను పరిశీలిస్తోంది. ఆ కూటమిలో కనిపెట్టబడిన ప్రతి నక్షత్రానికి కెప్లర్‌ అనే పేరు ఉంటుంది. కెప్లర్‌ 22 అంటే అది ఆ కూటమిలో ఇరవై రెండవ నక్షత్రం అని అర్ధం. ఇక ఆ నక్షత్రం చుట్టూ తిరిగే గ్రహానికి చిన్న ఆంగ్ల అక్షరం ఉంటుంది. అలా ఇప్పుడు కనిపెట్టబడిన గ్రహం పేరు కెప్లర్‌ 22బి అయ్యింది. (గ్రహం పేరులో ఎప్పుడూ ''ఎ'' పెట్టరు). కెప్లర్‌ గుర్తించిన పదకొండవ నక్షత్ర కూటమి కెప్లర్‌ 11. అందులో ఆరు గ్రహాలు ఉన్నాయి. అంటే వాటి పేర్లు బి నుండి జి వరకు ఉంటాయి. 11బి, 11సి, 11డి... ఇలా. అలాగే వాస్ప్‌ (షaరజూ), కారట్‌ (షశీతీశ్‌ీ) అనే టెలిస్కోప్‌లు కనిపెట్టిన గ్రహాల పేర్లు ఆ టెలిస్కోపుల పేర్లతోనే మొదలౌతాయి.
అయితే అన్ని ఖగోళ పరిశీలనలకూ ఇటుంటి పేర్లు ఉండవు. అంగారక గ్రహం గుర్తించిన లోయలకు భూమిపైన లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణాల పేర్లు పెట్టాలని నాసా నిర్ణయించింది. ఫలితంగా అంగారక గ్రహం ఉత్తరార్థం లోని ఒక లోయకు స్కాట్లాండ్‌ లో ఉన్న 'బాల్వికార్‌' అనే పట్టణం పేరు, దక్షిణార్థంలోని ఒక దానికి 'బ్రిస్టల్‌' అనే పేరు వచ్చాయి. అయితే అసంఖ్యాకంగా ఉండే నక్షత్రాలకు ఆ విధమైన నామకరణం సాధ్యం కాదు. ఏదేమైనా 'కెప్లర్‌' అన్న పేరు కూడా అంత తక్కువదేమీ కాదు. కెప్లర్‌ అనేది పదహారవ శతాబ్దపు జర్మన్‌ ఖగోళ శాస్త్రవేత్త పేరు. ఆయన ఆషామాషీ మనిషి కాడు. సూర్యుడి చుట్టూ గ్రహాలు ఎలా పరిభ్రమిస్తున్నాయో వివరించాడు. దాని ఆధారంగా తరువాత న్కూటన్‌ గ్రహాలు ఆ విధంగా ఎందుకు పరిభ్రమిస్తాయో వివరించాడు.
ఇకపోతే శాస్త్రీయ పరిశోధనకు కొన్ని సమస్యలున్నాయి. మనకు తెలియని విషయాలను తెలియజేయడం వరకూ బానే ఉంది గానీ బోలెడు డబ్బు, సమయం వెచ్చించి వెలికి తీసిన విషయాలు మానవ జీవనానికి ఏ విధంగా ఉపయోగపడతాయన్న ప్రశ్న కొందరిని వేధిస్తుంది. సరే భూమి వంటి గ్రహం ఇంకొకటి కాకపోతే ఇంకో కోటి ఉండొచ్చు. వాటిమీద మనలాంటి వారూ, కాకపోతే ఇంకోలాంటి వారూ ఉండొచ్చు. అయితే ప్రస్తుతం మనకి అందువల్ల ఒనగూడే లాభం గానీ నష్టం గానీ ఏమిటి? చంద్రునిపై ఏముందో తెలుసుకుని ఏం చేశాం? అంగారకుడిపై ఒకప్పుడు నీరు ఉండి నేడు ఆవిరైపోయి ఉంటే ఏం చేస్తాం అంటారు వీళ్లు. అయితే శాస్త్రవిజ్ఞానరంగంలో ప్రతి మైలురాయికీ ఇంటువంటి దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. స్వంతానికి కోట్లు సంపాదించుకునే స్పోర్ట్స్‌మెన్‌ వల్లా, ఆ క్రీడల వల్లా, కోట్లలో చేసే సినిమా వ్యాపారం వల్లా సామాన్య మానవుడికి ఒరిగింది ఏమీలేదు. ఇటువంటి వాటికంటే శాస్త్రపరంగా ఎదగడం, విస్తరించడం, వివరించడం, విజ్ఞానాన్ని పంచడం మంచిదే కదా. మనందరం వెళ్లి కెప్లర్‌ 22బి పైన ప్లాట్లు కట్టేదీ లేదు. అక్కడ ఎవరైనా వుంటే వారు వచ్చి భూమిపై ప్లాట్లు కొనేదీ లేదు. కానీ శాస్త్ర పరిశోధన విశ్వ రహస్య వివరాలను మన ముందు విప్పి ఆరబోస్తోంటే ఆనందించడానికి అడ్డేముంది?

Monday, December 3, 2012

మన తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్స్ కొరత బాగా ఎక్కువగా వుంది. అస్సలు మన తెలుగు హీరోయిన్స్ కి ఏమైంది . ఒక్కప్పుడు అంటే 1960, 1970,1980 లో తెలుగు తెరను అంతా తెలుగు  హీరోయిన్సే ఏలారు. పాతతరం లో చెప్పాలంటే సావిత్రి, జమున, అంజలి దేవి ఇలా ఎంతోమంది గొప్ప నటీమణులు వున్నారు. కేవలం నటనలోనే కాదు అదంలో కూడా వాళ్ళకి వాళ్ళే సాటి. అలాగే 1980 లో వచ్చిన  విజయశాంతి, రాధ , రజని, రమ్యకృష్ణ , సౌందర్య,మీనా లాంటి వాళ్ళు కూడా వాళ్ళ నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. కానీ తరువాత నుండి తెలుగు తెర మీద పరబాష హీరోయిన్ల హవా మొదలు అయ్యింది. ఇప్పుడు తెలుగు తెర మీద స్టార్ హీరోయిన్స్ గా వెలుగుతున్న వారందరూ దాదాపు పరబాష వాళ్లె. కొంతమందికి తెలుగు మాట్లాడడం కూడా సరిగా రాదు. అలాఅని అస్సలు తెలుగు హీరోయిన్స్ ఇప్పుడు లేరు అని నేను అనడం లేదు. కలర్స్ స్వాతి, బిందు మాధవి ఇలా  వున్న వాళ్ళని వేళ్ళమీద  లేక్కపెట్ట వచ్చు. కానీ వాళ్ళకు వస్తున్న అవకాశాలు కూడా అరకొరగా వున్నాయి.ఇది కేవలం మన తెలుగు సినిమాలకె పరిమితమయిన సమస్య కాదు. దాదాపు అన్ని బాష చిత్రాల్లొను ఇలాగే జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది ? భూమి గుండ్రంగా వున్నట్టు మరలా ఎదో ఒకరోజు మన తెలుగు చిత్ర సీమ  తెలుగు హీరోయిన్స్ తో కళకళ లాడాలని కోరుకుందాము.

ఈ పోస్ట్ ఫై మీ అబిప్రాయాలను తెలుపగలరు.
చిరంజీవి గారి గురించి అందరికి తెలిసే వుంటుంది. కానీ ఈ మధ్య పేపర్ లో చిరంజీవి గారికి సంబందించిన ఈ అర్టికల్ కనిపించింది. ఇది మీ అందరితో పంచుకొవాలి అనిపించి ఇలా పోస్ట్ చేస్తున్నాను.

కుటుంబం

ఆగష్టు 22, 1955 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లో కొణిదెల వెంకట్రావు,అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించాడు.చిరంజీవి వివాహం ప్రసిద్ధ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో 1980లో జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.

చిరంజీవి సోదరులు నాగేంద్రబాబు (సినిమా నిర్మాత, నటుడు), పవన్ కళ్యాణ్ (మరొక కధానాయకుడు). చిరంజీవి బావ అల్లు అరవింద్ ప్రముఖ సినిమా నిర్మాత. చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ కూడా సినిమా కధానాయకునిగా రాణిస్తున్నాడు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ హీరోగా సినిమా నిర్మాణం 2007లో "చిరుత"తో ప్రారంభమైంది. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదలై 170 కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకుంది.

తరువాత చిరంజీవి గారు రాజకియ్యాలోకి వచ్చిప్రజారాజ్యం పార్టి ఎర్పాటుచేసారు. చిరంజీవి తన పార్టీ పతాకాన్ని తిరుపతిలో ఆవిష్కరించటం జరిగింది. దీనిలో ప్రదానంగా మూడు రంగులు కలవు. పతాకంలో పై మూడో వంతు తెలుపు రంగు కలదు. క్రింద ఒకవంతు ఆకుపఛ్ఛ రంగు కలదు. ఈ రెంటిని కలుపుతూ మద్యలో ఎరుపు రంగులో సూర్యుడు వృత్తాకారంలో కలదు.ప్రజారాజ్యం పార్టీకి రైలింజన్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ పార్టీ స్థాపనతో తెలుగుదేశం , కాంగ్రెస్ పార్టీలకు గట్టిపోటీ వుంటుంది అందరు అనుకున్నారు.కానీ ఇప్పుడు ఈ పార్టి కాంగ్రెస్ లో విలీనం అయ్యింది.

చలనచిత్ర ప్రస్థానం

చెన్నై లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత 1978 లో పునాది రాళ్లు సినిమా చిరంజీవి నటించిన మొదటి సినిమా. కాని ప్రాణం ఖరీదు ముందుగా విడుదల అయ్యింది. మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషకం 1,116 రూపాయలు. మనవూరి పాండవులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ, ఇది కధ కాదు వంటి సినిమాలలో చిన్న పాత్రలు, విలన్ పాత్రలు పోషించాడు.

ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాతో చిరంజీవి హీరోగా నిలద్రొక్కుకున్నాడు. ఇంకా రుద్రవీణ, చంటబ్బాయ్,ఛాలెంజ్, శుభలేఖ చిత్రాలలో వివిధ తరహా పాత్రలలో మెప్పించి మంచి గుర్తింపు పొందాడు. గాంగ్ లీడర్ సినిమా చిరంజీవికి బలఙయన మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. 1980, 90లలో రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి వినోదాత్మక చిత్రాలు, ఆపద్బాంధవుడు, స్వయంకృషి వంటి సున్నితమైన పాత్రలతో వచ్చిన సినిమాలు కూడా విజయవంతమయ్యాయి. తరువాత కొంతకాలం చిరంజీవి సినిమాలు అంతగా విజయవంతంగా నడువ లేదు.

2007-2008 సంవత్సరాలలో చిరంజీవి రాజకీయాలలోకి రావాలని రాష్ట్రమంతటా ప్రదర్శనలు జరిగాయి. పోస్టర్లు వెలిశాయి.మళ్ళీ 1990 దశకం చివరిలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, హిట్లర్, చూడాలని వుంది సినిమాలు మంచి విజయాలను సాధించాయి. 2002లో వచ్చిన ఇంద్ర,ఠాగూర్ సినిమాలు తారా పధంలో చిరంజీవిని అత్యుత్తమ స్థానానికి తీసుకు వెళ్ళింది.

ఇదే సమయంలో చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు విస్తృతంగా చర్చనీయాంశాలయ్యాయి. తరువాత వచ్చిన శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్, స్టాలిన్ వంటి సినిమాలు విజయవంతాలైనా గాని సినిమా బడ్జెట్‌లు విపరీతంగా పెరిగి పోవడం వలనా, ప్రేక్షకుల అంచనాలు అతిగా ఉండడం వలనా, రంగంలో తీవ్రమైన పోటీ నెలకొనడం వలనా అంత పెద్ద హిట్‌లుగా పరిగణించబడడం లేదు.

తెలుగు సినిమా రంగంలో చిరంజీవిని మొదటి యాక్షన్-డాన్స్ మాస్ హీరోగా చెప్పుకోవచ్చును. అంతకు ముందు హీరోల సినిమాలలో ఈ అంశాలున్నా వాటికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. ఇంకా ఈ ఇమెజ్ వలన చిరంజీవి సున్నితమైన పాత్రలు పోషించిన సినిమాలకు తగినంత ప్రాధాన్యత రాలేదనిపిస్తుంది.

సేవా కార్యక్రమాలు

హైదరాబాద్‌లో చిరంజీవి రక్త, నేత్రనిధి ప్రధాన కార్యాలయంచిరంజీవి అక్టోబర్ 2, 1998లో 'చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్' స్థాపించాడు. 'చిరంజీవి బ్లడ్ బాంక్', 'చిరంజీవి ఐ బాంక్' ఈ ట్రస్టు నడుపుతున్న ముఖ్య సేవా సౌకర్యాలు. రాష్ట్రంలో అత్యధికంగా నేత్రదానం, రక్తదానం సాగిస్తున్న సంస్థలుగా ఇవి గుర్తింపు పొందాయి. అభిమానుల ఉత్సాహాన్ని, సేవా దృక్పధాన్ని పెద్దయెత్తున సమాజసేవా కార్యక్రమాలకు మళ్ళించడం ఈ ట్రస్టులు సాధించిన ఘనవిజయం. వీరి రక్తదానం వలన రాష్ట్రంలో 80,000 మంది, నేత్రదానం వలన 1000 మంది సేవలనందుకొన్నారని అంచనా . ఇప్పటికి ఈ సంస్థలకు 3.5 లక్షల మంది తమ మరణానంతరం నేత్రాలను దానం చేయడానికి ముందుకొచ్చారు. నాలుగు సంవత్సరాలు ఈ సంస్థలు 'అత్యుత్తమ సేవా సంస్థలు'గా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలనందుకొన్నాయి.

సత్కారాలు

 పురస్కారం పేరు బహుకరించింది సంవత్సరం ఇతర వివరాలు
 పద్మభూషణ్ 2006 జనవరి,2006 లో భారత ప్రభుత్వం తరపున అప్పటి రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలామ్ నుండి  పద్మభూషణ్ పురస్కారం స్వీకరణ.
 డాక్టరేట్  2006 నవంబర్ 2006లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేటు ఆంధ్ర యూనివెర్సిటీ తరపున అప్పటి ఆంధ్ర గవర్నర్ మరియు చాన్సుల్లర్ రామేశ్వర్ థాకూర్ నుండి.

రాజకీయ ప్రవేశం

చిరంజీవి ప్రజా రాజ్యం అనే పార్టీని స్ఠాపించారు. 2007 వ సంవత్సరం నుండి ప్రసార మాద్యమాల ద్వారా జరుగుతున్న చర్చకు తెరదించుతూ 17 ఆగస్టు 2008 తన రాజకీయ ప్రవేశ విషయాన్ని పత్రికా ముఖంగా ప్రకటన విడుదల చేసారు. 26 ఆగస్టు 2008 న (మదర్ థెరిసా జన్మదినం) తిరుపతి ఆవిలాల చెరువు మైదానం లో బహిరంగ సభను ఏర్పాటు చేసి తన పార్టీ పేరును, పతాకాన్ని ఆవిష్కరించటం జరిగింది.తురువాత జరిగిన ఎన్నికల్లో ప్రజా రాజ్యం పార్టీ అశించినంత పలితాలను పొందలేకపోయ్యింది .ఇప్పుడు ఈ పార్టి కాంగ్రెస్ లో విలీనం అయ్యింది. అంతేకాకుండా చిరంజీవి గారికి కాంగ్రెస్ ప్రబుత్వం కేంద్ర టూరిజం శాక మంత్రిగా పదవిని కూడా ఇచ్చారు.ఎమైన చిరంజీవి గారి సిని ప్రస్తానం వున్నంత ఆశాజనికంగా వారి రాజకీయ జీవితం లేదనే చెప్పాలి.



Sunday, December 2, 2012



పిల్లల కోసం కూడా వెబ్ సైట్లు !


-ఇప్పుడున్న ఇంటర్నెట్ యుగం లో మహిళల కోసం, పెద్దవాళ్ళ కోసం, అలానే యూత్ కోసం ఇలా అందరికి కావలసిన ఇన్ఫర్మేషన్ అందించే వెబ్ సైట్ లు ఎన్నో అందుబాటులో వున్నాయి.అలానే పిల్లలకోసం కూడా చక్కని సైట్ లు ఉన్నాయన్న విషయం తెలుసా మీకు .-వాటిల్లో కధలు,కామిక్ లు గేమ్స్,ఆర్ట్ వర్క్ ,జంతువులూ,క్రాస్ వర్డ్ ,హ్యూమర్,పద్యాలు ,క్విజ్ , సైన్స్పాటాలు ఇలా ఎన్నోఆసక్తికరమైన మరియు మంచి అంశాలు ఉన్నాయి.   ఇవి పిల్లలకు బాగా ఉపయోగపడుతాయి. ఇవిగో అ సైట్ లు. 
www.bolokids.com, 
www.indianchild.com, 
www.pitara.com, 
www.dimdima.com, 
http://kids.n ationalgeographic.com/kids/,
www.hindukids.com, www.4to40.com

Saturday, December 1, 2012

అనుకోకుండా లాటరిలో 1000 కోట్లు వస్తే?


 నాకు లాటరిలో 1000 కోట్లు వచ్చాయే  అనుకోండి ! నేనయితే ఇలా ఖర్చుచేస్తా...

1.మొట్టమొదట లోన్లు , అప్పులు అన్నీ క్లియర్ చేసేస్తా.
2.తరువాత మంచి సిటిలొ ల్యాండ్ కొనేస్తా.
3.తరువాత ఫ్యామిలీ తో కలిసి అమేజాన్ అడవికి ట్రిప్ వెళ్తా..
4.కొత్త వాళ్ళతో సినిమా తీసి మరో రవితేజ లాంటి హీరోని, క్రిష్ లాంటి డైరక్టర్  ని తయారు చేస్తా.
5.కొంతమంది మనుషులను పెట్టి సిటి మొత్తం క్లీన్ చెయ్యిస్తా.
6.న్యాయానికి సపోర్ట్ చేసే టీవీ చానల్ పెడతా.
7.ఈ మధ్యనే పేపర్లో చదివాను రెండున్నర కోట్లు వుంటే అంగారక గ్రహం మీదకీ వెళ్ళవచ్చుఅని. దీనికీ కుడా ట్రై చేస్తా.

మరి మీరు ఎలా ఖర్చుచేస్తారో చెప్పండి....







Friday, November 30, 2012

ఇలా జరిగేతే ఎలా వుంటుంది !

నాకు అప్పుడప్పుడు ఇలా జరిగితే బలే తమాషాగా వుంటుంది కదా అనిపిస్తుంది. అది ఏంటంటే ఒకవేళ ఎవరినా దేవుడు  దిగివచ్చి నాకు  అదృశ్యం అయ్యే వరం ఇస్తే బాగుటుంది కదా అని. కాని ఈ వరం ఒక్కరోజు మాత్రమే వుండాలి. ఎందుకంటే ఎప్పటికి వుంటే మరలా దాని విలువ మనకి తెలిదు కదా అందుకు. నాకే గనక ఈ వరం వుంటే నేను అ వరమును ఇలా ఉపయొగించుకుంటాను.

1. నాకు ఎవరిమీదయిన కోపం వుంటే వెళ్లి వాళ్ళని నాలుగు దెబ్బలు వేసి వస్తాను.
2.ఒకవేళ అ రోజు పవన్ కళ్యాన్  సినిమా గనక రిలీజ్ అయివుంటే  హాయిగా అ  సినిమా చుస్తాను. అది కూడా టికెట్ లేకుండా.
3. సినిమా షూటింగ్ జరుగుతుంటే చుడాలి అని నాకు చిన్నప్పటినుండి బాగా ఇష్టం . అందుకే అది కూడా చుసెస్తాను.
4.బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర నుండి దొంగతనం చేసి అ డబ్బును పేదవాళ్ళకు పంచుతాను. మన తెలుగు సినిమాల్లో హీరో లాగ.

మరి మీకు కూడా ఇలాంటి వరం వస్తే దానిని ఎలా ఉపయొగించుకుంటారొ చెప్పండి.




అనామిక వేలుకి ఉంగరం తప్పకుండా పెట్టుకోవాలా !

అనామిక వేలుకి ఉంగరం తప్పకుండా పెట్టుకోవాలా ! దీనికి మన శాస్త్రాలు అవును అని సమాధానం చెప్తున్నాయి. అనామిక వేలు అంటే ఉంగరం వేలు అని అర్ధం. స్త్రీ , పురుషుల జీవనాడుల్లోని ఓ ముక్యమైన నాడి ఈ ఉంగరం వేలు వరకు వుంటుంది.అ నాడికి వత్తిడి  కావాలి.అందుకే ధనంతో సంబంధం లేకుండా బంగారం, వెండి,ఇత్తడి లేక రాగి ఎలా ఎదో ఒక ఉంగరాన్ని ఉంగరం వెలికి ధరించమని వట్టిగా ఉండకూడదు అని పెద్దలు చెప్తారు.


Thursday, November 29, 2012

బాల్యం ఒక వరం అంటారు కదా ! మరి వృద్ధాప్యం వరమా లేక శాపమా ?


బాల్యం అనేది ఒక మదురమైన అనుభూతి. అందుకే దాన్ని దేవుడు ఇచ్చిన వరం అని అంటారు. అలానే వృద్ధాప్యం కూడా దేవుడు మనకి ఇచ్చిన  మరొక గొప్పవరం అని నా  అభిప్రాయం . ఎందుకంటే మనిషి మజిలిలో చివరి దశ వృద్ధాప్యం.తన జీవితమంతా కుటుంబం కష్టపడ్డ మనిషికి  ఈ సమయంలో తన  కొడుకులు, కోడళ్ళతో , మనుమలతో హాయిగా గడపాలి అని వుంటుంది. అంతకుమించి వాళ్ళు మన దగ్గర నుండి ఏమి ఆశించరు. కానీ మనం చేస్తున్నది ఏమిటి!రెక్కలువచ్చిన పక్షిగూడు నుంచి ఎగిరి పోయినట్టు మనసంపాదన చేతికి రాగానే వాళ్ళని వదిలి వేస్తున్నాము.  వృద్ధాశ్రమాల పేరుతో వారిని మన నుండి దూరం అందరుచేస్తున్నాము.అందరు ఇలానే చేస్తున్నారు అని నెను చెప్పడం లెదు. కానీ ఇలా చేస్తున్నవారు కూడా రోజు రోజుకి ఎక్కువ అవుతున్నారు. అందువల్లనే వృద్ధాశ్రమాల సంఖ్య  కూడా రోజు రోజుకి గణనీయంగా పెరుగుతోంది. మనల్ని కని , పెంచి,చదివించి మన కాళ్ళ మీద మనం నిలబడేలా చేసిన తల్లితండ్రుల్ని మన కళ్ళలో పెట్టుకొని చూసుకోవడం  మనకు  దేవుడు  ఇచ్చిన వరం అని నా అభిప్రాయం. మీరు ఏమంటారు ?

Tuesday, November 27, 2012

మనం తింటున్న తిండి,తాగుతున్న నీరు , పీలుస్తున్న గాలి ఎంతవరకు స్వచ్చమైనవి?

మనం తింటున్న తిండి,తాగుతున్న నీరు , పీలుస్తున్న గాలి ఎంతవరకు  స్వచమైనవి?ఈ ప్రశ్నకు సమాధానం 100  శాతం కలుషితమయినవి . ఒక్కప్పుడు ఒక ఎకరా పొలంలోరెండు పుట్ల వరి పండేది. అది ఎటువంటి క్రిమిసంహారక మందులను వాడకుండా కేవలం ఎరువు వేసి పండించేవారు.కాని ఇప్పుడు అధిక దిగుబడుల కోసం మోతాదుకు మించి క్రిమిసంహారక మందులను వాడడం వల్ల మనం తినే ఆహారం కలుషితం  అయింది . పారిశ్రామీకరణ పేరుతో ఫ్యాక్టరీలను నిర్మించి వాటి నుండి వెలువడే వ్యర్దాలను శుద్దిచేయకుండా బయటకు విడుదల  చెయ్యడం వల్ల పీల్చె గాలి కలుషితం అయ్యింది. అంతేకాకుండా పరిశ్రమల వ్యర్దాలను కాలువలలోకి, చెరువులలోకి మరియు సముద్రాల్లోకి వదలడం వల్ల భూగర్బ జలాలు కూడా కలుషితమవుతున్నాయి . అందుకే ఇంట్లో బావులు వున్నా కూడా త్రాగే నీరు కొనుక్కో వలసిన దుస్థితి వచ్చింది.

Monday, November 26, 2012

లేవగానే కళ్లకు చేతులు రుద్ది అడ్డుకునేదీ దేనికి ?

కొంతమందికి లేవగానే కళ్లకు  చేతులు రుద్ది  అడ్డుకునే అలవాటు వుంటుంది. ఇలా చేస్తే మంచిది అని మన పెద్దవాళ్ళు చెప్పెవారు. కొంతమంది దినీని చాదస్తంగా కొట్టి పారేస్తారు.   కాని అందులో ఎంతో ఆరోగ్యం , ఉత్సాహం దాగి వుంది.  నిద్రలేవగానే రెండు చేతులు రుద్దుకొని కళ్ళకు అద్దుకుంటే చేతుల్లొని ఉష్ణ శక్తీ కనులుద్వారా శరీరానికి 
వ్యాపించి మొత్తము శరీరానికి ఉత్తేజెం కలిగిస్తుంది.చేతులు రుద్దు కునేటప్పుడు బ్రహ్మ రాసిన చేతి గీతలు అనుకోకుండా చుడటం ద్వార బ్రహ్మను పుజించినంత ఫలం కూడా దక్కుతుంది.


Sunday, November 25, 2012

ఇది కలియుగమా లేక ప్లాస్టిక్ యుగమా?

మనము ఎదుర్కుంటున్న సమస్యల్లో ముఖ్యమయినది ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య . 

ఆధునిక మానవుని జీవనంతో ముడిపడి ఉన్న వస్తువు ప్లాస్టిక్. పిల్లలు, పెద్దలు ప్లాస్టిక్ సంచుల వాడకానికి అలవాటుపడిపోయారు.పాలప్యాకెట్లు, తినుబండారాలు, కృత్రిమంగా తయారుచేసిన పొడులు, శీతలపానీయాలు, దేవుడికి హారతిచ్చే పవిత్రమైన కర్పూరం, పూజా సామగ్రి .. అన్నింటికీ ప్లాస్టిక్ సంచులనే వాడుతున్నాం. వాడిన తర్వాత వాటిని వీధుల్లో పారేసి సమస్యలు సృష్టించుకుంటున్నాం. వీటి వాడకం ఎక్కవగా ఉండడానికి గల కారణం ఏదయినా వస్తువు కొన్నపుడు వాటితో పాటు ప్లాస్టిక్ కవర్ లను ఫ్రీగా ఇవ్వడమే.ప్లాస్టిక్ వస్తువులు కాలిస్తే డయాక్సిన్, ఫ్యూరాన్ అనే విషవాయువులు వాతావరణంలో ప్రవేశిస్తాయి.

భూమిలో పాతిపెట్టినా మట్టిలో కలవడానికి అనేక సంవత్సరాలు పడుతుంది. పశువులు తినేస్తే, వాటి పేగుల్లో అడ్డుకుని ప్రాణాలు కోల్పోతున్నాయి.పల్చని ప్లాస్టిక్ కవర్ల ఉత్పత్తి సంస్థల నిషేధానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.కేవలం ప్రబుత్వమే  కాదు  మనలో కూడా  చైతన్యం రావాలి . తాడిపత్రిలో ప్లాస్టిక్ కవర్ల వాడకం నిషేధం అమలుచేసి ఆదర్శంగా నిలిచింది. ప్లాస్టిక్ వాడ కాన్ని నిషేధించడం ఎంతైనా అవసరం. 

సెల్లు సామెతలు


* ÍäAê„çÖ å®©Õx.. èä¦ÕÂ¹× *©Õx! 
* å®©ü©ð ²ñ©Õx.. G©Õx «ÍÃa¹ ’í©Õx! 
* ¤¶ò¯þ©ð X¾Â¹X¾Â¹-©Õ.. ¦ä©¯þq ÍŒÖ®Ï ¦ã¹¦ã¹-©Õ! 
* ƒ¯þ¹NÕ¢’û ƪáÅä ƒÂ¹ƒÂ¹-©Õ... »šü’îªá¢’û ƪáÅä ¹ÂÃ-N¹-©Õ! 
* ¦äœ¿ÂË J¸Âïà ©äŸ¿Õ ¹Êo¤Äp Æ¢˜ä ¦ÇxÂú¦ã“K ‡X¾Ûpœ¿Õ Âí¢šÇ«ÛªÃ ÍçÊo¤Äp ƯÃoœ¿¢{! 
* Æ©ÕxœËÂË ÆéªÂ¹ª½¢ ¹{o¢ ƒ²Äh¢ ÂÃF ‚éªo@ÁÙx 宩üG©Õx ¹{d©äÊÕ Æ¯Ão{d ‹ «Ö«Õ!

Friday, November 23, 2012

జావ.. శక్తి

నీరసంగా ఉన్నప్పుడు, జ్వరంతో ఉన్నపుడు శరీరం చాలా నిస్సత్తువుకు గురవుతుంది. ఇటువంటప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోమని వైద్యులు చెప్తారు. కాని ఆ ఆహారం నోటికి సహించక తినడానికి కష్టపడుతుంటారు. ఇటువంటప్పడు జావ సేవిస్తే శారీరక బలంతోపాటు మానసిక ఆరోగ్యం పొందవచ్చు . జావ అంటే మనం తినే ఆహారం బియ్యం, గోధుమలు, జొన్నలు ... ఇటువంటిది ఏదైనా కానీయండి, దీనిని రవ్వలాగా మరపట్టించి, దోరగా వేయించి, నీళ్లలో కలిపి జావలాగా చేసుకొని తాగితే తేలికగా జీర్ణమవుతుంది. వేయించడం వలన దానిని జీర్ణం చేసుకోవడానికి అదనపు జీర్ణశక్తిని వెచ్చించాల్సిన అవసరం రాదు. అలాగే, ద్రవయుక్తంగా ఉంటుంది. కనుక దప్పికను తీరుస్తుంది. వేడిగా ఉంటుంది కనుక చెమటను పుట్టించి జ్వరం దిగేలా చేస్తుంది. మరీ నీళ్లను మాదిరిగా కాకుండా ఘనాహారంతో కలిసి ఉంటుంది కనుక శరీరానికి బలాన్నీ, శక్తినీ ఇస్తుంది. అలాగే మలాన్నీ, వాయువునూ బహిర్గత పరుస్తుంది. జావలో రుచికోసం శొంఠిని, సైంధవ లవణాన్ని చేర్చి తీసుకోవచ్చు. వీటి వలన దీని గుణాలు ద్విగుణీకృతమవుతాయి. దీనిలో మెత్తగా ఉడికించిన కూరగాయల ముక్కలు వేసుకొంటే కూడా శరీరానికి అదనపు శక్తి ఒనకూడుతుంది

.

స్వామి రా రా ..మూవీ మేకింగ్ వీడియో

స్వామి రా రా ..మూవీ మేకింగ్ వీడియో




ప్రతి పూజకి అవుపాలే ఎందుకు వాడుతారు ?

 ఆవు సమస్త  సృష్టిలోకి పవిత్రమైనది .సకల దేవతలకి నివాస స్థలము . అందుకే పూజల్లో ,వ్రతాల్లో ,యజ్ఞాల్లో ఆవు పాలు ,పెరుగు, నెయ్యి వాడతారు.ఆవుపాలంటే సమస్త దేవతలను మన శుభకార్యానికి పిలిచినట్టె .అందుకే  వారి ఆహ్వానానికి చిహ్నమె ఆవుపాల వాడకము.

Thursday, November 22, 2012

భోజనము చేస్తునప్పుడు ఎన్ని నీళ్ళు త్రాగాలి?


ఈ విషయము ఆయుర్వేదం లొ చెప్పబడి వుంది. భోజనము ప్రారంభించిన దగ్గర్నుంచి పూర్తి అయ్యెవరకు అరగ్లాసు మాత్రమె త్రాగాలి.భొజనము అయ్యాక ఓ గంట తరువాత ఓ గ్లాసు ఆపై  త్రాగాలి . ముద్ద  ముద్ద  కీ మధ్యలో నీరు త్రాగితే శరీరంలోకి వెళ్ళిన ఆహారం సాంబారు లో తేలే ముక్కల్లా జీర్ణం కాక మలబద్దక సమస్యలు, ఉదర సమస్యలు వస్తాయి .

మధుమేహంతో జాగ్రత్త అవసరమే

ప్రపంచానికే మధుమేహ రాజధానిగా మన దేశం ప్రసిద్ధికెక్కింది. 35 మిలియన్లకిపైగా ఇప్పటికే మన దేశంలో మధుమేహంబారిన పడ్డారు. ఈ సంఖ్య 2030 నాటికి 80 మిలియన్లకి పెరగవచ్చునని ఒక అంచనా. మన దేశంలో కూడా మధుమేహ పీడితులకు ‘హైదరాబాద్’ అగ్రగామిగా నిలుస్తోంది.హైదరాబాద్‌లో 20కి పైబడిన వాళ్ళల్లో 16 శాతంమంది మధుమేహంతో బాధపడుతున్నారు. 30 శాతం మంది ప్రి డయాబెటిక్ స్టేజీలో ఉన్నారు. హైదరాబాద్‌లో 40కిపైబడ్డ ప్రతీ ఇద్దరిలో ఒకరికి మధుమేహం పీడిస్తుంది.


దురదృష్టం కొద్దీ మధుమేహ లక్షణాలు అంతగా బాధించేవి కావు. అందుకే దానిని అంతగా పట్టించుకోము. నష్టం జరిగిపోయిన తర్వాతగానీ, దాని నిజస్వరూపం బయటపడదు.కాబట్టే దీనిని ‘సైలెంట్ కిల్లర్’ అంటారు. రక్తంలో షుగర్ ఎక్కువైతే దాహం పెరగవచ్చు,మూత్రం ఎక్కువసార్లు అవుతుండవచ్చు. దెబ్బలేమైనా తగిలితే త్వరగా మానవు.బరువు తగ్గుతుంది. అలసట,మర్మావయవాల దగ్గర దురద లాంటి లక్షణాలు ఉండవచ్చు.విచిత్రమేమిటంటే తమకు మధుమేహం ఉందని మధుమేహం ఉన్నవాళ్ళల్లో 60 శాతం మందికి తెలియదని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలతో వెల్లడైంది.తెలుసుకున్న వాళ్ళల్లో 50 శాతంమంది మాత్రమే తగిన వైద్యాన్ని తీసుకుంటున్నారు. నగరాల్లో సంగతి ఇలా ఉంటే పల్లెల్లో సంగతి చెప్పనక్కర్లేదు.


తెలిసినా, తెలియకపోయినా మధుమేహం వల్ల నరాలు, రక్తనాళాలు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు,కాలేయం, కళ్లు, పాదాలు లాంటివెన్నో దెబ్బతింటాయి. కాబట్టి మధుమేహం గురించి  అన్ని విషయాలు అందరూ తెలుసుకోవాలి.మధుమేహం నుంచి అందరూ రక్షణ పొందాలి.


మధుమేహ పరీక్షలు ఎవ్వరు చేయించుకోవాలి?

-కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉంటే...

-35 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ...

-అధిక బరువు, ఊబకాయం ఉన్నవాళ్ళు...

-90 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఛాతీ వున్న మగవాళ్ళూ, 80 సెం.మీ కన్నా తక్కువ ఛాతీ వున్న ఆడవాళ్లూ...

-ఎక్కువ కదలికలు లేని జీవితాన్నిగడుపుతున్నవాళ్ళూ...

-ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నవాళ్ళు...

-అధిక రక్తపోటు ఉన్నవాళ్ళు...

-కొలెస్ట్రాల్ లేక ట్రైగ్లిజరైట్స్ స్థాయి ఎక్కువగా ఉన్నవాళ్ళు...

-3.5 కి.గ్రా. బరువున్న శిశువుకు జన్మనిచ్చిన స్ర్తి...

-స్టెరాయిడ్స్ తీసుకునేవాళ్ళు...


మధుమేహం రిస్క్ ఎలా ఉంటుంది 

తల్లిదండ్రులిద్దరికీ మధుమేహం ఉంటే... 99 శాతం

తల్లిదండ్రులలో ఒకరికి మధుమేహం ఉండి రెండోవాళ్ళ బంధువులెవరికైనా మధుమేహం ఉంటే... 75 శాతం తల్లిదండ్రులలో ఒక్కరికే మధుమేహం ఉంటే...50 శాతం 

తల్లిదండ్రులకుగా కదగ్గర బంధువులకెవరికైనా ఉంటే...25 శాతం


బ్లడ్‌షుగర్ స్థాయి ఎక్కువగా ఉంటే...దానితో బెంబేలు పడిపోవాల్సిన పనిలేదు. రక్తంలో పెరిగిన గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి ప్రయత్నించాలి. మొదట పదేళ్ళు మధుమేహం అదుపులో ఉంటే ఫర్వాలేదు. దీని తాలూకు ప్రభావం మిగతా అవయవాలమీద పడదు. ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామం చేస్తూ అవసరమైన మందుల్ని వాడుతూ, ఒత్తిడిని తగ్గించుకుంటూ, కొన్ని అలవాట్లని మందు, ధూమపానంలాంటి వాటిని మానుకొని జీవన విధానాన్ని మార్చుకోవడంతో మధుమేహాన్నిఅదుపులో ఉంచుకోవచ్చు. అలా పదేళ్ళు నిర్లక్ష్యం చేస్తే మధుమేహ ప్రభావం వ్యాధి కాదుగాని,నిర్లక్ష్యం చేస్తే ఎన్నో వ్యాధులకు కారణమవుతుంది. 


అంటే ఖచ్చితంగా చెప్పాలంటే మధుమేహం ‘చాపకింద నీరులాంటిది’. రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చాలా అవయవాలు దెబ్బతినవచ్చు.మధుమేహాన్ని అదుపులో ఉంచుకోకపోతే ఎన్నో అనర్థాలు కలుగుతాయి. నరాలు దెబ్బతింటాయి. ముందుగా శరీరంలో పొడవైన నరం... అంటే పాదాలలో ముగిసే నరాలు.. కంటికి వెళ్ళే ఆప్టిక్ నెర్వ్ మధుమేహంవల్ల దెబ్బతినవచ్చు. అంటే కాళ్ళు, కళ్ళు దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. పాదాలలో నరాలు దెబ్బతినడంవల్ల మొదట్లో స్పర్శ ఎక్కువై, ఆ తర్వాత స్పర్శ పూర్తిగా తగ్గిపోయి బాధపడతారు. పాదాలలో ఏమైనా దిగినా తెలీదు. కారణం నొప్పిలేకపోవడమే! నరాలు దెబ్బతినడంవల్ల నొప్పి తెలీదు. పాదాలకు రక్తప్రసరణ మధుమేహంలో క్రమంగా తగ్గుతుంది. కాబట్టి గాయం మానదు. పైగా ఆ ప్రాంతంలోకి రక్తసరఫరా సరిగ్గా లేకపోతే గాంగ్రీన్ కుళ్ళిపోవడం మొదలవుతుంది. ఎక్కడో బొటన వేలు దగ్గర ప్రారంభమైన గాంగ్రీన్  ప్రభావం క్రమంగా కాలంతా కూడా చూపించవచ్చు.

Wednesday, November 21, 2012

గర్బిణులకు సెల్ వద్దు


’¹Js´-ºÕ©Õ ÆŸä-X¾-E’à 宩ü-¤¶ò-Êx©ð ¦ÇÅÃ-‘ÇF ÂíœËÅä.. X¾Û˜äd XÏ©x©ðx “X¾«-ª½hÊ X¾ª½-„çÕiÊ ®¾«Õ-®¾u©Õ ÅŒ©ã-ÅŒÕh-ÅçŒÕE ÅÃèÇ ÆŸµ¿u-§ŒÕ-¯Ã©ðx ’¹ÕJh¢-Íê½Õ.


ƒŸç¢ÅŒ «ª½Â¹Ø E•„çÖ ÅçL-§ŒÕ-Ÿ¿Õ-ÂÃF.. “¤ÄŸ±¿-NÕ¹ ÆŸµ¿u-§ŒÕÊ X¶¾L-ÅÃ©Õ «Ö“ÅŒ¢ ’¹Js´-ºÕ©Õ ÆA’à 宩ü-¤¶ò¯þ „Ãœ¿-¹-¤ò-«-{„äÕ «Õ¢*-Ÿ¿E ®¾Ö*-®¾Õh-¯Ãoªá. œç¯Ãt-ªýˆ©ð XÏ©x©ðx 宩ü-¤¶ò¯þ Æ©-„Ã-{xåXj ƒšÌ-«© ÍäX¾-šËdÊ ÆŸµ¿u-§ŒÕÊ¢©ð ‚®¾-ÂËh-¹-ª½-„çÕiÊ Æ¢¬ÇLo „ç©x-œ¿-§ŒÖuªá. ¨ ÆŸµ¿u-§ŒÕ-Ê¢©ð ¦µÇ’¹¢’à 13 „ä©-«Õ¢C XÏ©xLo X¾J-Q-L¢-Íê½Õ. ‚ XÏ©x©ÅŒ©ÕxLo ’¹Js´-ºÕ-©Õ’à …Êo-X¾Ûpœ¿Ö, XÏ©x-©Â¹× 18 ¯ç©© «§ŒÕ-®¾Õ-«-*aÊ ÅŒªÃyÅÃ, «ÕSx \œä@Áx «§ŒÕ-®¾Õ-©ðÊÖ X¾J-Q-L¢-Íê½Õ. ‡Â¹×ˆ-«’à 宩ü-¤¶ò¯þ „Ãœä XÏ©x-©ðxÊÖ, „ê½Õ ¹œ¿Õ-X¾Û©ð …Êo-X¾Ûpœ¿Õ ÅŒ©Õx©Õ ÆA’à 宩ü-¤¶ò¯þ „ÃœËÊ „ÃJ©ð-ÊÖ XÏ©x©ðx “X¾«-ª½hÊ X¾ª½-„çÕiÊ ®¾«Õ-®¾u©Õ ÅŒ©ã-Ah-Ê{Õx ’¹ÕJh¢-Íê½Õ. ƒ©Ç¢šË XÏ©x©ðx …Ÿäy-’Ã©Õ ‡Â¹×ˆ-«’à …¢œ¿{¢, \ÂÃ-“’¹ÅŒ ¹ן¿-ª½-¹-¤ò-«{¢, ÆA-ÍŒÕ-ª½Õ-¹×-Ÿ¿Ê¢ «¢šË ®¾«Õ-®¾u©Õ …¢{Õ-Êo{Õx ÅäL¢C.