Wednesday, November 14, 2012

భూమికి అయస్కాంత క్షేత్రం లేకపోతే..



అయస్కాంతం అంటే ఏమిటో చదువుకునే పిల్లలందరికీ తెలిసే ఉంటుంది. చిన్న చిన్న అయస్కాంతాలు మన అరచేతిలో కూడా ఇమిడిపోతుంటాయి. ఇలాగే మన భూగోళం కూడా ఉత్తర -  దక్షిణ ధ్రువాల మధ్య మన కంటికి కనిపించని శక్తి రేఖలను ప్రసరింపజేస్తుంది. ఈ అయస్కాంత రేఖలతో కూడిన క్షేత్రాన్నే అయస్కాంత క్షేత్రం లేదా అయస్కాంతావరణం (మాగ్నటోస్పియటర్) అంటారు.

అయితే మన అరచేతిలో ఇమిడిపోయే ఓ మామూలు అయస్కాంతం తాలూకు క్షేత్రం కేవలం కొన్ని అంగుళాల దాకా విస్తరించి ఉంటే, భూమి తాలూకు అయస్కాంత క్షేత్రం మాత్రం దాని ఉపరితలం నుంచి సుమారు 36,000 మైళ్ల దూరం దాకా వ్యాపించి ఉంటుంది. మరి భూమికి ఈ అయస్కాంత క్షేత్రమే లేకపోతే.. ఇదే అంశంపై శాస్త్రజ్ఞులు ఏనాడో పరిశోధనలు చేశారు.

సౌరమండలంలో సూర్యుడి నుంచి రోదసిలో అన్ని దిక్కులకూ చిన్న చిన్న కణాలతో ఉండే సౌరపవనాలు ఉదృతమైన వేగంతో ప్రయాణిస్తాయి. ఇవి గంటకు 10,00,000 మైళ్ల వేగంతో ప్రయాణిస్తాయి. అయితే మన భూమి తాలూకు అయస్కాంత క్షేత్రం శక్తివంతమైన ఈ సౌరపవనాలను సమర్ధంగా అడ్డుకుని వెనక్కు తిప్పికొడుతుంది. దాని ఫలితంగానే భూమిపై జీవులు పుట్టేందుకు వికసించేందుకు వీలయ్యిందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

ఒకవేళ ఈ అయస్కాంత క్షేత్రమే లేకుంటే భూగోళంపై చాలా విద్వంసం చోటు చేసుకునేదని శాస్త్రజ్ఞులు స్పష్టం చేశారు. భూమి కేంద్రభాగంలో పెద్ద మొత్తంలో ఉన్న వేడి వలన కరిగిన ఇనుములో విద్యుత్ ప్రవాహాలు చోటు చేసుకోవడం... దీనికి తోడు భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల కలిగే చలనశక్తి వల్ల భూమి చుట్టూ ఇలా ఒక శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడిందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియనే  డైనమో ఎఫెక్ట్ అని పిలుస్తారు.

No comments:

Post a Comment