Wednesday, November 14, 2012

నోట నువ్వు గింజ నానదు...



భారతయుద్ధం ముగిశాక మరణించిన బంధుమిత్రులందరికీ ధర్మరాజు పితృకార్యం చేస్తున్నాడు. అక్కడికి వచ్చిన కుంతీదేవి కర్ణుడికి కూడా జరిపించమని కోరింది. ఎందుకని అడగ్గా తాను కన్యగా ఉన్నప్పుడు కర్ణుడు పుట్టిన వైనాన్ని వివరించింది. సొంత అన్నను చేతులారా చంపుకున్నాము, ముందే చెబితే ఇలా జరిగేది కాదు కదా అంటూ దుఃఖించాడు ధర్మరాజు. తల్లిమీద కోపంతో, ‘ఇకమీదట స్త్రీల నోట రహస్యం దాగదు’ అంటూ శపించాడు. 

అప్పట్నుంచే ఇది వాడుకలోకి వచ్చింది. నువ్వు గింజ నానడానికి ఎంతో సమయం పట్టదు. ఆ కాస్త సమయం కూడా స్త్రీలు రహస్యాలు దాచలేరు అని దీని భావం.

No comments:

Post a Comment