Wednesday, November 14, 2012

పట్టుచీర అరువిచ్చి పీట పట్టుకుని వెనకాలే తిరిగినట్టుంది...



ఒక ఊళ్లో ఒకామె ఉండేది. ఆవిడకు మొహమాటం చాలా ఎక్కువ. దాంతో ఏదడిగినా కాదనలేదు అన్న నమ్మకంతో అస్తమానం ఎవరో ఒకరు వచ్చి, ఆమెను ఏదో ఒకటి అడుగుతూ ఉండేవారు. ఆమె మొహమాటంకొద్దీ వాళ్లు అడిగింది ఇచ్చి పంపించేది. అలాగే ఒకసారి పక్కింటామె వచ్చి, వాళ్లింట్లో పేరంటం ఉంది పట్టుచీర ఇవ్వమని అడిగింది. ఈమెకు మనసొప్పలేదు. ఎందుకంటే ఈమె అడిగింది తనకెంతో ఇష్టమైన పట్టుచీర. దానికేదైనా అయితే మళ్లీ కొనుక్కుందామన్నా దొరకను కూడా దొరకదు. అలాగని ఇవ్వను అని కూడా అనలేదు. అందుకే, కాదనలేక ఇచ్చి పంపించింది. కానీ పేరంటం జరుగుతున్నంతసేపూ పీట పట్టుకుని ఆమె వెనకాలే తిరుగుతూ ఉందట. అది చూసినవాళ్లు ఎందుకలా తిరుగుతున్నా.. ‘ఆవిడ కింద కూర్చుంటే నా పట్టుచీర పాడైపోతుంది కదా, అందుకే పీట వేద్దామని’ అందట. అప్పట్నుంచీ ఎవరైనా మొహమాటానికి పోయి తమ వస్తువులు ఇచ్చి, తర్వాత వాటి గురించి ఆందోళన చెందుతుంటే ఈ మాట అంటుంటారు. అదే సామెతగా మారింది. 

No comments:

Post a Comment