Sunday, November 25, 2012

ఇది కలియుగమా లేక ప్లాస్టిక్ యుగమా?

మనము ఎదుర్కుంటున్న సమస్యల్లో ముఖ్యమయినది ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య . 

ఆధునిక మానవుని జీవనంతో ముడిపడి ఉన్న వస్తువు ప్లాస్టిక్. పిల్లలు, పెద్దలు ప్లాస్టిక్ సంచుల వాడకానికి అలవాటుపడిపోయారు.పాలప్యాకెట్లు, తినుబండారాలు, కృత్రిమంగా తయారుచేసిన పొడులు, శీతలపానీయాలు, దేవుడికి హారతిచ్చే పవిత్రమైన కర్పూరం, పూజా సామగ్రి .. అన్నింటికీ ప్లాస్టిక్ సంచులనే వాడుతున్నాం. వాడిన తర్వాత వాటిని వీధుల్లో పారేసి సమస్యలు సృష్టించుకుంటున్నాం. వీటి వాడకం ఎక్కవగా ఉండడానికి గల కారణం ఏదయినా వస్తువు కొన్నపుడు వాటితో పాటు ప్లాస్టిక్ కవర్ లను ఫ్రీగా ఇవ్వడమే.ప్లాస్టిక్ వస్తువులు కాలిస్తే డయాక్సిన్, ఫ్యూరాన్ అనే విషవాయువులు వాతావరణంలో ప్రవేశిస్తాయి.

భూమిలో పాతిపెట్టినా మట్టిలో కలవడానికి అనేక సంవత్సరాలు పడుతుంది. పశువులు తినేస్తే, వాటి పేగుల్లో అడ్డుకుని ప్రాణాలు కోల్పోతున్నాయి.పల్చని ప్లాస్టిక్ కవర్ల ఉత్పత్తి సంస్థల నిషేధానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.కేవలం ప్రబుత్వమే  కాదు  మనలో కూడా  చైతన్యం రావాలి . తాడిపత్రిలో ప్లాస్టిక్ కవర్ల వాడకం నిషేధం అమలుచేసి ఆదర్శంగా నిలిచింది. ప్లాస్టిక్ వాడ కాన్ని నిషేధించడం ఎంతైనా అవసరం. 

5 comments:

  1. మీరు సౌందర్య సాధనాల గురించి మరిచిపోయినట్టున్నారు.
    అన్నిటికన్నా అసలు పనికిరాని ముఖ్యమైన వస్తువు.

    ReplyDelete
    Replies
    1. అవును సౌందర్య సాధనాల వల్ల కూడా ప్లాస్టిక్ వాడకం ఎక్కువగా వుంటుంది.

      Delete
  2. నిజమేనండి. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ఎంతో నష్టం కలుగుతోంది.

    ప్లాస్టిక్ వల్ల ఇప్పటికి అనుకుంటున్నదానికన్నా ఎక్కువ నష్టాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కొత్తగా తెలుసుకున్నారట.

    ReplyDelete
    Replies
    1. అవును అందుకే ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని మనమే తగ్గించాలి.

      Delete
  3. prajalu kontunnanta varaku plastic antham kadu prajulu vadatam manivayali lekunte manamumdutharalaku chala kashtam

    ReplyDelete