Wednesday, November 14, 2012

చందమామ గురించి మీకు ఇవి తెలుసా?



చంద్రుడు తనచుట్టూ తాను తిరగడానికి (చంద్ర భ్రమణం) 29.5 (భూమి యొక్క) రోజులు లేదా ఒక చంద్రమాసం పడుతుంది. అంటే చంద్రుడిపై రోజు మరియు నెల కోసం, సమాన కాలం పడుతోంది.

చంద్రుడు భూమిని ఒక్కసారి చుట్టిరావడానికి (చంద్ర భూ పరిభ్రమణం) 27.3 రోజులు పడుతుంది. భూమి-చంద్రుడు-సూర్యుడు మధ్య వ్యవస్థాపక మార్పుల వల్ల ఒక చంద్రమాసానికి 29.5 రోజులు పడుతుంది. దీనినే చంద్రమాసం అంటారు.

చంద్రుడు తనచుట్టూ తాను తిరగడానికి (చంద్రభ్రమణం) మరియు భూమి చుట్టూ తిరగడానికి (చంద్ర భూ పరిభ్రమణం) ఒకే సమయం (చంద్రమాసము) పడుతుంది.
ఈ కారణం వల్ల భూ వాసులకు చంద్రుడి ఒకే ముఖం కనబడుతుంది. భూ వాసులు, చంద్రుడి ఆవలి వైపు ఇంత వరకు చూడలేదు. ఆవలి వైపు ఛాయాచిత్రాలు, చంద్రుడి పై ప్రయోగింపబడిన నౌకలు తీసాయి.

చంద్రుడు భూమితో కలసి సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి (చంద్ర భూ సూర్య పరిభ్రమణం), భూపరిభ్రమణానికి పట్టే కాలంతో సమానం.

చంద్ర మండలంపై వాతావరణం లేదు. అందుకే చంద్రునిపై కాలు మోపిన మొదటి మానవుని పాద ముద్రలు ఇప్పటికీ అలానే ఉన్నాయి.

చంద్ర గ్రహం యొక్క సాంద్రత భూమి సాంద్రతలో 1/6 వ వంతు ఉంటుంది. అందువల్ల భూమిపై 60 కేజీల బరువు ఉండే మనిషి చంద్రునిపై 10 కేజీలు మాత్రమే ఉంటాడు.

చంద్రుడి గరిష్ట ఉష్ణోగ్రత 127 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత -173 డిగ్రీల సెల్సియస్.

1959 సెప్టెంబర్ 14 రష్యా పంపిన లూనా-2 చంద్రుడి మీదకు మొట్టమొదట దిగింది

No comments:

Post a Comment