Wednesday, November 14, 2012

మొదటి ప్రపంచ యుద్ధం



మొదటి ప్రపంచ యుద్ధం  యూరప్ లో మధ్య ప్రాచ్య దేశాలలో జరిగింది. జర్మనీ సామ్రాజ్య విస్తరణ కాంక్ష వల్ల 1914 జూలై 28 న జర్మనీ నాయకత్వం లోని కేంద్ర రాజ్యాల అమెరికన్, బ్రిటన్ నాయకత్యంలోని మిత్ర రాజ్యలకు మధ్య ఈ యుద్ధం ప్రారంభమయ్యింది. ఇది 1914 జూన్ 28న మొదలై, 1918 నవంబర్ 11న ముగిసింది.

మొదటి ప్రపంచ యుద్ధం యూరప్, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలు, చైనా, ఫసిఫిక్ దీవుల ప్రాంతాల్లో జరిగింది. నాలుగేళ్ల పాటు జరిగిన ఈ మహాయుద్ధంలో ఆమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ నేతృత్వంలోని మిత్ర రాజ్యాలు విజయం సాధించాయి. 1919 జూన్ 28న శాంతి ఒప్పందం కుదిరింది.

ఈ యుద్ధం అనంతరం జర్మన్, రష్యన్, ఓట్టోమన్, ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యాలు కుప్పకూలిపోయాయి. యూరప్, మధ్య ప్రాచ్యంలో పలు కొత్త దేశాలు ఏర్పడ్డాయి. జర్మనీ వలసులుగా ఉన్న పలు దేశాలు ఇతర శక్తుల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ఈ యుద్ధం తర్వాత నానాజాతి సమితి ఏర్పడింది.

ప్రతిస్పర్ధులు : మిత్రరాజ్యాలు, అక్షరాజ్యాలు

మరణాలు-నష్టాలు

చనిపోయిన సైనికబలగాలు : 5,525,000

గాయపడిన సైనికులు : 12,831,500

తప్పిపోయిన సైనికులు : 4,121,000

No comments:

Post a Comment