Monday, November 12, 2012

వినాయకుడి పూజలో తులసిని ఎందుకు వాడరు?



ఓసారి వినాయకుడు గంగా తీరంలో విహరిస్తుంటే, ధర్మధ్వజ యువరాణి అతణ్ని చూసి ఇష్టపడింది. తనను పెళ్లి చేసుకోమని వినాయకుడిని అడిగితే కాదన్నాడు. దాంతో కోపగించుకుని దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమంటూ శపించింది యువరాణి. ప్రతిగా వినాయకుడు ఆమెను రాక్షసుడి దగ్గర దీర్ఘకాలం ఉండమని శపిస్తాడు. భయపడిన యువరాణి మన్నింపు కోరింది. శాంతించిన వినాయకుడు కొంతకాలం రాక్షసుడి దగ్గర ఉండి, తర్వాత పవిత్రమైన తులసిగా జన్మిస్తావని చెప్పాడు. అందుకే వినాయకుడు తులసిని ఇష్టపడడు. కాబట్టి ఆయన పూజలో తులసి నిషిద్ధం.

No comments:

Post a Comment