Thursday, November 15, 2012

అంతా మన మంచికే!


ఓసారి ఓ రాజుగారు పళ్లు తింటూండగా కత్తివేటుకు పొరపాటున వేలు తెగింది. పక్కనే ఉన్న మంత్రి ‘అంతా మన మంచికే’ అన్నాడు. రాజుకు కోపం వచ్చింది. మంత్రికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఆ తర్వాత రోజు వేటకెళ్లినప్పుడు, మంత్రిని ఒక బావిలోకి తోసి ‘‘ఏది జరిగినా మన మంచికే’’ అని వెటకారంగా నవ్వి వెళ్లిపోయాడు. అంతలో రాజును ఒక ఆటవిక జాతివారు బంధించి కాళికాదేవికి బలి ఇవ్వబోయారు. 

కానీ అతని వేలి గాయాన్ని చూసి బలివ్వడానికి పనికిరాడని వదిలేశారు. వేలు తెగినప్పుడు మంత్రి అన్నమాట గుర్తుకు వచ్చింది రాజుకి. వెంటనే మంత్రిని బావి నుండి వెలుపలికి తీశాడు. ‘‘నా వేలి గాయం నాకు మంచిదే అయింది, కానీ నిన్ను నూతిలోకి నెట్టడం నీకు మంచి ఎలా అయింది?’’ అనడిగాడు. అప్పుడు మంత్రి ‘‘నన్ను నూతిలోకి పడెయ్యకపోతే, మీతోపాటు నన్నూ పట్టుకునేవాళ్లు. మిమ్మల్ని వదిలేసి నన్ను బలిచ్చేవారు. అందుకే ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి’’ అన్నాడు. అప్పట్నుంచీ ఈ మాట వాడుకలోకి వచ్చింది.

No comments:

Post a Comment