Saturday, November 17, 2012

తోచీ తోచనమ్మ తోడికోడలి పుట్టింటికెళ్లినట్లు.


ఒక ఇంటిలో ఇద్దరు కోడళ్లున్నారు. ఒకరంటే ఒకరికి పడదు. రోజూ ఇద్దరి మధ్యా మాటల యుద్ధం మామూలే! అయితే ఓ రోజున ఒకామె తన పుట్టింటికి వెళ్లింది. ఆమెతో గిల్లికజ్జాలు పెట్టుకోవడానికి, గొడవ పడటానికి అలవాటు పడిన రెండో ఆమెకి ఈమె లేకపోయేసరికి ఏమీ తోచలేదు. దాంతో తోడికోడలి పుట్టింటికి ప్రయాణమై వెళ్లింది. ఈమెని చూసే సరికి ముఖం చిట్లించిందామె. మూతి విరిచింది ఈమె! అక్కడ వీరిద్దరి వాదులాట తారస్థాయికి చేరింది. ఆమె పుట్టింట్లో ఈమెకి బలం ఏముంటుంది? దాంతో ఈమె విసవిసలాడుతూ వెంటనే తిరుగు ప్రయాణమైంది. ఇది తెలిసిన వాళ్లందరూ ఈమెను ఆటలు పట్టించడం మొదలు పెట్టారు. అలా ఈ సామెత వాడుకలోకొచ్చింది. 

No comments:

Post a Comment