Tuesday, November 13, 2012

పూజలో పుష్పాలను ఎందుకు ఉపయోగిస్తారు?



పుష్పాలకు గల ఆకర్షణశక్తి వల్ల అవి వాతావరణంలోని దైవిక శక్తుల తరంగాలను తమలో ఐక్యం చేసుకుంటాయి. అలా ఐక్యం చేసుకున్న దైవిక శక్తికి తమలోని సువాసనను జోడించి, పరిసర ప్రాంతాలను అవి పవిత్రంగా మార్చుతాయి. వాటిని దైవానికి సమర్పించినప్పుడు వాటిలోని పుప్పొడి కోశం దైవంలోని శక్తిని గ్రహించి, ఆ శక్తిని సుగంధ పరిమళాలనిచ్చే ప్రాణవాయువు రూపంలో తిరిగి బయటకు ప్రసరింపచేస్తుంది. శాస్త్రపరంగా చెప్పాలంటే పుష్పాలు మనలోని వ్యతిరేక భావనలను సానుకూలంగా మార్చి, మనస్సులను ఆహ్లాదపరుస్తాయి. అందుకే పూజలో పుష్పాలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. 

No comments:

Post a Comment