Saturday, November 17, 2012

మొదల్లేదు మొగుడా అంటే



అదో నిరుపేద కుటుంబం. ఆ ఇంటాయనకి ఇల్లెలా గడుస్తుందో పట్టేది కాదు. ఇంటి ఇల్లాలే ఎట్లాగో తంటాలుపడి సంసారాన్ని నడిపిస్తుండేది. ఓరోజు ఆ ఇంటాయన తనతోబాటు ఓ అతిథిని వెంటబెట్టుకుని ఇంటికొస్తూనే ‘‘ఏమే... తొందరగా ఇంత ముద్దపప్పు చేసి, అంత దప్పళం కాచి, ఓ గరిటెడు గడ్డపెరుగు సిద్ధం చెయ్యి... ఇంట్లో ఎట్లాగూ ఊరగాయ ఉంటుందనుకో...’’ అన్నాడు. ఆ ఇంటావిడ గతుక్కుమంది. 

‘‘ఇంట్లో కందిపప్పు లేదండీ...’’ అంటూ ఏదో చెప్పబోతుంటే ‘‘- ఓసి నీ తెలివి తెల్లారా!... పెసరపప్పుతో చెయ్యవే’’ అన్నాడు. ఇంటావిడ తలకొట్టుకుంటూ మొగుణ్ని ఇంట్లోకి పిలిచి బియ్యంతో సహా ఇంట్లో వెచ్చాలన్నీ నిండుకున్నాయనే విషయాన్ని విడమరచి చెప్పింది. ఆ అతిథి కాస్తా మెల్లగా జారుకుని, నవ్వుకుంటూ ఇంటికెళ్లి ఇదంతా పెళ్లాంతో చెప్పాట్ట. అప్పటినుంచి ‘‘మొదల్లేదు మొగుడా అంటే పెసరపప్పొండవే పెళ్లామా’’ అన్నట్టు... అనే సామెత వాడుకలోకి వచ్చింది.

No comments:

Post a Comment