Friday, November 23, 2012

జావ.. శక్తి

నీరసంగా ఉన్నప్పుడు, జ్వరంతో ఉన్నపుడు శరీరం చాలా నిస్సత్తువుకు గురవుతుంది. ఇటువంటప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోమని వైద్యులు చెప్తారు. కాని ఆ ఆహారం నోటికి సహించక తినడానికి కష్టపడుతుంటారు. ఇటువంటప్పడు జావ సేవిస్తే శారీరక బలంతోపాటు మానసిక ఆరోగ్యం పొందవచ్చు . జావ అంటే మనం తినే ఆహారం బియ్యం, గోధుమలు, జొన్నలు ... ఇటువంటిది ఏదైనా కానీయండి, దీనిని రవ్వలాగా మరపట్టించి, దోరగా వేయించి, నీళ్లలో కలిపి జావలాగా చేసుకొని తాగితే తేలికగా జీర్ణమవుతుంది. వేయించడం వలన దానిని జీర్ణం చేసుకోవడానికి అదనపు జీర్ణశక్తిని వెచ్చించాల్సిన అవసరం రాదు. అలాగే, ద్రవయుక్తంగా ఉంటుంది. కనుక దప్పికను తీరుస్తుంది. వేడిగా ఉంటుంది కనుక చెమటను పుట్టించి జ్వరం దిగేలా చేస్తుంది. మరీ నీళ్లను మాదిరిగా కాకుండా ఘనాహారంతో కలిసి ఉంటుంది కనుక శరీరానికి బలాన్నీ, శక్తినీ ఇస్తుంది. అలాగే మలాన్నీ, వాయువునూ బహిర్గత పరుస్తుంది. జావలో రుచికోసం శొంఠిని, సైంధవ లవణాన్ని చేర్చి తీసుకోవచ్చు. వీటి వలన దీని గుణాలు ద్విగుణీకృతమవుతాయి. దీనిలో మెత్తగా ఉడికించిన కూరగాయల ముక్కలు వేసుకొంటే కూడా శరీరానికి అదనపు శక్తి ఒనకూడుతుంది

.

No comments:

Post a Comment