Tuesday, November 13, 2012

వంటింటి చిట్కాలు


1.పులుసు కూర లో ఉప్పు ఎక్కువ అయ్యిందా ? ఒక సారి ఇలా చేసి చూడండి.

ఒక బంగాళాదుంప  ను ముక్కలుగా  కోసి పులుసు లో వేసి కాసేపు వుడికిన తరువాత స్టవ్ ఆపుచెయ్యండి.
ఇలా చేస్తే బంగాళాదుంప  ముక్కలు కూర లో వున్న ఉప్పు ను పీల్చుకొని కూర లో వున్న  ఉప్పు తగ్గుతుంది.

2.రాత్రి మిగిలిన చపాతి లు గట్టిగా అయిపోయాయా  , వాటి మీద కొంచెం నీళ్ళు చల్లి మరలా పెనం మీద వేడి  చేసి చూడండి. అవి మరలా మృదువుగా తయారు అవుతాయి .

3.పెరుగు త్వరగా తోడుకోవాలంటే పాలలో ఒక చిన్న ఎండుమిరపకాయ ను గిల్లి వేసి చూడండి .ఇలా చేస్తే పెరుగు త్వరగా తోడుకుంటుంది .

4.వెల్లుల్లిపాయ పొట్టు త్వరగా రావాలంటే వాటిని కాసేపు పెనం మీద వేసి  కాసేపు  వేడి  చేసి చూడండి . ఇలా చేస్తే పొట్టు త్వరగా వుడీ వస్తుంది.

5.వడలు లాంటి డీప్ ఫ్రై వంటలు చేసేటప్పుడు నూనె లో కొద్దిగా ఉప్పు వేసినట్టు అయెతే అవి నూనె తక్కువగా పీల్చుకుంటాయి.

6.మీరు ఉల్లగడ్డలు కొంటున్నారా , అయెతే  కొనేముందు వాటి మీద ఎటువంటి ఆకుపచ్చ రంగు లేనీ వాటిని చూసి తీసుకోండి. ఎందుకంటే అలాంటి మచ్చలువున్న ఉల్లగడ్డలు తినడం మన ఆరోగ్యానికి మంచిది కాదు.

7.కొత్తిమీర ఎక్కువ రోజులు ఫ్రిజ్ లో ఉంచిన కూడా తాజాగా వుండదు. కానీ దానిని ఫ్రిజ్ లో పెట్టేముందు ఒక న్యూస్ పేపెర్ లో చుట్టి గనగ ఫ్రిజ్ లో  పెట్టి నట్టు అయెతే అది చాల రోజుల వరకు బాగా .తాజా గ వుంటుంది.

8.దోశ పిండి కి బియ్యం నాన పెట్టేటప్పుడు బియ్యం , మినపప్పు తో పాటుగా ఒక టీ స్పూన్ మెంతులు కూడా వేసీనట్లు అయెతే దోశలు బాగా క్రిస్పి గా వస్తాయి.

9.కాకరకాయ ఆరోగ్యానికి మంచిది అన్న విషయం అందరికి తెలిసే  వుంటుంది. కానీ కాకరకాయ లో వున్న చేదు  కారణంగా దానిని తినడానికి చాల మంది ఇష్టపడరు .కాకరకాయ లో వున్న చేదు తగ్గాలంటే కాకరకాయను ముక్కలుగా కోసి వాటిని బియ్యం కడిగిన నీళ్ళలో ఒక గంట సేపు వుంచి నట్టు అయెతే చేదు అంతా పోతుంది.

10.పెరుగు త్వరగా పులవకుండా వుండాలి అంటే దానిలో ఒక టీ స్పూన్ పంచదార గనగ వేసీనట్లు అయెతే త్వరగా పులవకుండా వుంటుంది.

11.మాములుగా చలికాలంలో ఇడ్లి పిండి సరిగా పులవదు. ఇలాంటప్పుడు ఇడ్లి పిండి లో ముందే గనక ఉప్పు వేసి వుంచి నట్లు అయెతే పిండి పులుస్తుంది. అదే ఎండాకాలంలో నైట్ కూడా వేడీ బాగా వుండడం వల్ల పిండి బాగా పుల్లగా అయ్యిపోతు వుంటుంది. ఇలాంటప్పుడు పిండి లో ముందుగా ఉప్పు వెయ్యకుండా వుంటే సరిపోతుంది.

12.దోశలు బాగా మెత్తగా  రావాలి అంటే బియ్యం, మినపప్పు తో పాటు కొద్దిగా సగ్గుబియ్యం వేస్తే సరిపోతుంది.

13.ఇప్పుడు  మనం వాడె కూరగాయలు అన్ని చాలావరకు మోతాదుకు మించి క్రిమిసంహారక మందులు వాడి  పండిం చినవి అని మనకు తెలుసు. కానీ కూరగాయలు కోసే ముందు వాటీని కాసేపు ఉప్పు కలిపిన నీళ్ళ లో వుంచి తరువాత గనగ వంటకు వాడుకునట్లు అయితే మనం ఇ పురుగు మందుల వల్ల  కలిగే ధుస్పలితాలు నుంచి పూర్తిగా కాకపోయినా కొంచెం తప్పించుకోవచ్చు .

14.పంచదార కు చీమలు ఎక్కకుండా వుండాలి అంటే పంచదార డబ్బాలో ఒక లవంగం వేస్తె సరిపోతుంది.

15.కందిపప్పు త్వరగా ఉడకాలి అంటే ఉడక పెట్టె ముందు పప్పు లో కొంచెం నూనే వేసీ తరువాత ఉడికిస్తే సరిపోతుంది .

16.అంట్లు కడిగేటప్పుడు, కొన్ని రకాల కూరగాయలు కోసినప్పుడు చేతులు నల్లబడతాయి. అలాంటప్పుడు పచ్చి బొప్పాయి పాలతో చేతులు రుద్దుకుంటే నలుపు పోతుంది.

17.వడియాలు చేసుకునేటప్పుడు ఆ పిండిలో కొద్దిగా నిమ్మరసం కలిపితే తెల్లగా వస్తాయి.

18.బెండకాయ వేపుడు చేసేటప్పుడు ముక్కలు జిగురు రాకుండా, అడుగున అంటుకోకుండా ఉండాలంటే వేపుడు చేసే పాత్రలో కొంచెం ఇంగువ వెయ్యాలి.

19.వంట నూనె నిల్వ ఉంచిన డబ్బా లో రెండు లవంగమొగ్గలు వేస్తే నూనె మంచి వాసన వస్తుంది.

20.క్యాబేజి వండేటప్పుడు చెంచా నిమ్మరసం వేస్తే వాసన రాకుండా ఉంటుంది.

21.మష్రూమ్స్ ను కాగితం సంచిలో ఉంచితే వదిలిపోకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

22.వంటింట్లో చీమలు బారులు తీరితే ఆ ప్రాంతంలో కొద్దిగా పసుపు చల్లితే సరిపోతుంది.

23.బొంబాయి రవ్వతో ఉప్మా చేసేటప్పుడు ఉండ కట్టకుండా ఉండాలంటే నూకకి చెంచా నూనె పట్టిస్తే సరిపోతుంది.
పచ్చికొబ్బరి లోపల నిమ్మరసం పూస్తే కొబ్బరి నిల్వ ఉంటుంది.

24.ఎండు కొబ్బరిని సులభంగా తురమాలంటే దానిపై కొద్దిగా నీళ్ళు చల్లి ఫ్రిజ్ లో ఉంచాలి.

25.క్యాబేజి వండేటప్పుడు చిన్న అల్లం ముక్క వేస్తే వాసన రాదు.

26.అరటికాయ ముక్కలుగా కోసేటప్పుడు తోలు తీసిన అరటికాయను మజ్జిగ కలిపిన నీళ్ళల్లో వేస్తే ముక్కలు నల్లబడవు.

27.బీట్ రూట్ సన్నగా తరిగి ఎండబెట్టి మెత్తటి ఫౌడరుగా చేసుకుని ఫుడ్ కలర్ గా ఉపయోగించుకోవచ్చు.

28.పూరి పిండి కలిపేటప్పుడు నీటికి బదులుగా పాలను కలిపితే పూరీలు మెత్తగానే కాకుండా రుచిగా కూడా ఉంటాయి.



29.వేయించిన అప్పడాలు మెత్తగా అవకుండా కరకరలాడుతూ ఉండాలంటే వాటి కింద బ్లాటింగ్ పేపర్ వేసి నిల్వ ఉంచాలి .

30.అప్పడాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే అవి ఉంచిన డబ్బాలో కొంచెం ఇంగువ ఉంచాలి.

31.గిన్నెలు తోమే స్క్రబ్బర్‌ను తరుచూ నిమ్మరసంలో నానబెట్టి శుభ్రపరచాలి. అప్పుడే దానిపై చేరుకొని ఉన్న హానికారక క్రిముల దూరమవుతాయి.

32.ఉల్లి పాయలను గ్రైండ్ చేసే ముందు కొద్దిగా నూనె వేసి వేయిస్తే పేస్ట్ ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.


33.ఎక్కువగా పండిన టమాటలను ఉప్పు కలిపిన చల్లని నీటిలో రాత్రంతా ఉంచితే ఉదయానికల్లా తాజాగా మారుతాయి.

34.టమాటాలను ఏడెనిమిది నిమిషాలపాటు వేడి నీటిలో ఉంచి తీస్తే తొక్క సులభంగా వస్తుంది.

35.కూరల్లో ఉప్పు ఎక్కువైతే తొక్క తీసిన పచ్చి టమాట అందులో వేస్తే అదనపు ఉప్పును అది పీల్చుకుంటుంది.

37.మిరప్పొడి ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే డబ్బాలో చిన్న ముక్క ఇంగువ వేయాలి.

38.ఉప్పు సీసాలో ఒక చెంచా మొక్కజొన్న పిండి వేస్తే ఉప్పు తడిబారి ముద్ద కాదు.

39.చక్కెర డబ్బాలో మూడులేక నాలుగు లవంగాలు వేస్తే చీమలు పట్టవు.

40.బిస్కిట్లు నిలువ చేసే డబ్బాలో అడుగున బ్లాటింగ్ పేపర్ వేస్తే మెత్తబడకుండా కరకరలాడుతాయి.

41.పచ్చళ్ళలో బూజు రాకుండా ఉండాలంటే, చిన్న ఇంగువ ముక్కను నిప్పు మీద కాల్చి ఖాళీ జాడీలో పెట్టాలి. అరగంట తరువాత జాడీలో నుండి ఇంగువ ముక్కను తీసివేసి పచ్చడి వేయాలి.

42.బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే, డబ్బాలో ఎండు వేపాకులు కాని ఎండు మిరపకాయలు కాని వేయాలి.

43.ఎండుకొబ్బరిచిప్ప కందిపప్పుడబ్బాలో వేసి నిల్వ ఉంచితే పప్పు పాడవదు.


44.కాకరకాయ ముక్కలను కొంచెం ఉప్పురాసి,నీళ్ళు చల్లి గంట సేపు ఉంచితే చేదు పోతుంది.

45.వెల్లుల్లిపాయను మెత్తగా దంచి కొంచెం నీటితో కలిపి బొద్దింకలు వచ్చేచోట ఉంచితే అవి ఆ ప్రాంతానికి రావు.

46.మినపప్పు త్వరగా నానాలంటే ఆ నీళ్లలో ఇనుపవస్తువు ఏదైనా వెయ్యాలి.

47.బ్రెడ్ పేకెట్ లో బంగాళదుంప ముక్కలు ఉంచితే త్వరగా పాడవదు.

48.నూనె పొంగకుండా ఉండాలంటే నూనెలో కొంచెం చింతపండు వెయ్యాలి.

49.చేతులకు నూనెరాసి పనసకాయ తరిగితే జిగురు అంటకుండా ఉంటుంది.

50.గుడ్లు ఉడకబెట్టేటపుడు కొంచెం ఉప్పు వేసి ఉడకనిస్తే పెంకులు త్వరగా ఊడిపోతాయి.

51.పకోడిలు వేసేటపుడు పిండిలో కొంచెం సోడా కలిపితే లావుగా అవుతాయి.





No comments:

Post a Comment