Tuesday, November 13, 2012

పెళ్లిలో జీలకర్ర, బెల్లం ఎందుకు పెడతారు?



వివాహంలో సరిగ్గా ముహూర్తం వేళకు పురోహితుడు జీలకర్ర, బెల్లం కలిపిన మిశ్రమాన్ని వధూవరులిద్దరూ ఒకరి తలమీద ఒకరు ఉంచేలా చేస్తారు. శాస్త్రరీత్యా ఈ ‘గుడజీరక’ మిశ్రమానికి బ్రహ్మరంధ్రాన్ని తెరిపించే శక్తి ఉంటుందట.

అలా జీలకర్ర, బెల్లం కలిపి నూరిన ముద్దని తలలమీద పెట్టుకునే సమయంలో ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకోవాలి. అలా చూసుకున్న సమయంలో వధూవరులిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఆకర్షణ కలిగి, జీవితాంతం అన్యోన్యంగా కలసిమెలసి ఉంటారట! అందుకే జీలకర్ర, బెల్లాన్ని ఒకరి శిరస్సు మీద మరొకరు ఉంచుతారని ‘ధర్మసింధు’ గ్రంథం చెబుతోంది.

No comments:

Post a Comment