Friday, November 2, 2012

అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు..


అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు...

ఓసారి ఒక వ్యక్తి తన స్నేహితుడితో కలిసి వేటకెళ్లాడు. అడవంతా వెతికినా ఒక్క జంతువూ కనబడక నీరసపడ్డాడు. ఇంతలో ఒక పొద కదులుతూ కనిపించింది. చూస్తే పులి ఉన్నట్టు అనిపించింది. వెంటనే స్నేహితుడితో... ‘ఒరేయ్, అదిగో పులి, కనిపించిందా’ అన్నాడు హుషారుగా. రెండోవాడు అటు చూశాడు కానీ ఏమీ కనిపించలేదు. అలా చెబితే బాగోదని... ‘అవునవును నిజమే. అదిగో తోక’ అన్నాడు. దాంతో మొదటి వ్యక్తి పులిని వేటాడాలని బాణాలు సంధించాడు. తర్వాత వెళ్లి చూస్తే అక్కడ పులి కాదు కదా, చిన్న జంతువు కూడా లేదు. తోక కనిపించిందన్నావుగా అని అడిగితే, నీకు పులి కనిపించినప్పుడు నాకు కనీసం తోకైనా కనిపించిందని చెప్పకపోతే బాగోదుకదా అని పళ్లికిలించాడు స్నేహితుడు. దాంతో నవ్వలేక ఏడ్చాడా వ్యక్తి. అప్పట్నుంచీ ఈ సామెత వాడుకలోకి వచ్చింది. లేనిదాన్ని ఉన్నట్లు ఎవరైనా ఊహించుకున్నా, దానికి ఇంకో రెండు మాటలు కలిపి ఇంకెవరైనా చెప్పినా ఈ సామెత వాడతారు.


                                                                 సామెతలు 









































1 comment:

  1. మంచి విషయాలు చెప్పారు...

    ReplyDelete